మిడిల్ క్లాస్ ఓటు బ్యాంకుపై టీడీపీ క‌న్ను..?

మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి క‌ష్టాలు ఎక్కువ అంటుంటారు.ఎందుకంటే డ‌బ్బున్న వాళ్ల‌కి అన్ని విలాసాలు ఉంటాయి.

 Tdp On The Middle Class Vote Bank Details, Ap, Tdp, Middle Class, Ycp, Middle Cl-TeluguStop.com

పెద‌వాడికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు. ఏ ప‌ని అయినా చేయ‌గ‌లిగే త‌త్వం ఉండ‌టం.

అదే మిడిల్ క్లాస్ వాళ్లు ముందుకి చేరుకోలేరు.వెన‌క్కి వెళ్ల‌లేరు.

చివ‌ర‌కి ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో జ‌రిగే మార్పులు .ద్ర‌వ్యోల్బ‌ణంతో పాటు ప్ర‌స్తుతం ప్ర‌కృతి విప‌త్తులు కూడా ఎదుర్కొంటూ ఇబ్బందులు ప‌డుతున్నారు.ధ‌ర‌లు పెరిగితే ఏక్కువ‌గా ఇబ్బంది ప‌డేది మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్లే.ధ‌ర‌లు పెరిగాయి క‌దా అని తిన‌కుండా ఉండ‌లేరు.అలాగ‌ని కొనుక్కుని తిన‌లేరు.ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న‌ట్లు వీళ్ల ప‌రిస్థితి ఉంటుంది.

అయితే రాజ‌కీయ పార్టీలు కూడా పేద‌వాళ్ల‌పై మ‌మ‌కారం చూపిస్తూ ఎంతో చేసేస్తామ‌ని కొంతైనా చేస్తున్న‌ప్ప‌టికీ మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్ల‌నే ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.

ఏ సంక్షేమ పథ‌కం అయినా పేద‌వారి చుట్టే తిరుగుతుంది.

ప్ర‌భుత్వాలు కూడా పేద‌ల ప‌క్ష‌పాతిగా గుర్తింపు తెచ్చుకోవ‌డానికి ఏమి చేయ‌న‌ప్ప‌టికీ ఎంతో చేస్తున్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంటాయి.కానీ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్ల‌పై వివ‌క్ష చూపుతున్నారు.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సైతం పేదలు అంటోంది తప్ప మిడిల్ క్లాస్ గురించి అసలు పట్టించుకోవడంలేదు.వీరంతా పట్టణాలు నగరల్లో ఎక్కువ‌ సంఖ్యలోనే ఉన్నారు.

వీళ్లు త‌లుచుకుంటే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కూడా దండిగానే చూప‌గ‌ల‌రు.ఫ‌లితాల‌ను కూడా తారుమారు చేయ‌గ‌ల‌రు.

మ‌ధ్య త‌ర‌గ‌తిలో ఉద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు.

Telugu Ap, Chandrababu, Cmjagan, Jagananna Smart, Middle Class, Middleclass-Poli

ఇప్పుడు సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ఖ‌ర్చులు పెరిగిపోవ‌డంతో ఏపీ అప్పుల్లో కూరుకుపోవడం.పైగా వీరు ఏ ఒక్క పథ‌కానికి కూడా అర్హులు కాలేకపోతున్నారు.వీళ్ల కోసం ఈ మూడేళ్ల‌ వైసీపీ సర్కార్ ఏమీ చేయలేదు కూడా.

అయితే వీళ్ల‌ను మ‌చ్చిక చేసుకునే ప‌నిలో టీడీపీ ఉంది.దీంతో కొత్త ఓటు బ్యాంక్ వ‌స్తుంద‌ని.అధికారంలోకి రావ‌డానికి మ‌రింత‌గా కృషి చేస్తార‌ని న‌మ్ముతోంది.జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేఖ‌త‌తో మిడిల్ క్లాస్ వ‌ర్గం ఇపుడు టీడీపీ వైపే ఆశగా చూస్తోంద‌ని అంటున్నారు.దీంతో టీడీపీ అక్కున చేర్చుకుని క్యాష్ చేసుకునే ప‌నిలో ఉంది.

వాళ్ల కోసం టీడీపీ.

Telugu Ap, Chandrababu, Cmjagan, Jagananna Smart, Middle Class, Middleclass-Poli

వ‌చ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే ప‌క్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నార‌ని అంటున్నారు.ఏపీ ఇప్ప‌టికే అప్పులకుప్ప అవ‌డంతో మరిన్ని ఉచిత హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని మ‌రింత దివాలా చేసేందుకు తాము సిద్ధంగా లేమంటున్నారు.ఈ నేప‌థ్యంలోనే పేదల పక్షాన ఉంటూనే మధ్యతరగతిని ఆకట్టుకునే మార్గాన్ని కూడా టీడీపీ అన్వేషిస్తోంది విశ్లేష‌కులు అంటున్నారు.ఏపీలో 175 సీట్లు ఉంటే అందులో అరవై సీట్ల దాకా పట్టణ నేపథ్యంలో ఉన్నవే.

దీంతో ఈ సీట్లలో గ‌న‌క తమకు అనుకూలతను తెచ్చుకుంటే కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పుటు చేయ‌గ‌లుగుతామ‌ని లెక్క‌లేసుకుంటోంది టీడీపీ.

అలాగే మధ్యతరగతి వర్గాలకు పది లక్షల లోపే ఇల్లు కట్టించి ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటోంది.

అలాగే రేష‌న్ కార్డుల విష‌యంలో కూడా కొత్త‌గా జారీ చేయాల‌నే ఆలోచ‌న కూడా ఉంద‌ట‌.ఈ విషయాల్లో కచ్చితమైన హామీలు ఇస్తే ఈ వ‌ర్గం టీడీపీకి బాసటగా నిలుస్తుంద‌ని భావిస్తున్నారు.

అయితే జగన్ సర్కార్ జగన‌న్న స్మార్ట్ సిటీస్ అని చెప్పినా రేట్లు ఎక్కువగా ఉండ‌టం.న‌మ్మ‌కం స‌న్న‌గిల్ల‌డంతో ఆస‌క్తి చూపిస్త‌లేరు.

దీంతో రీజనబుల్ ధరలతో సొంతిల్లు ఇచ్చే ఆలోచనతో టీడీపీ ఉందని అంటున్నారు.టీడీపీకి ఇక మిడిల్ క్లాస్ తోడైతే మాత్రం అధికారానికి ద‌గ్గ‌ర‌లో ఉంటార‌ని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube