పవన్ కు బ్రెయిన్ వాష్ చేస్తున్న టిడిపి మీడియా?

తెలుగుదేశం, జనసేన ( Telugu Desam ,Janasena )ల పొత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమేనని, లక్షల మంది యువత భవిష్యత్తు కోసం ఈ రెండు పార్టీలు పొత్తు పేట్టుకున్నాయి తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పదేపదే చెబుతున్నారు.ముఖ్యంగా రెండు పార్టీల నుంచి టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలను సర్దుకుపోమని ఒప్పించే దిశగా ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.

 Tdp Media Brainwashing Pawan , Pawan, Tdp, Telugu Desam ,janasena , Pawan Kalya-TeluguStop.com

అయితే తెలుగుదేశం మీడియా మాత్రం కేవలం జనసైనికులను మాత్రేమే సర్దుకుపోమని పవన్ చెబుతున్నారని, ఈసారి రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము తగ్గితే వచ్చేసారి మనకు అవకాశం ఉంటుందని పవన్ చెబుతున్నారంటూ పేడార్ధాలు తీస్తుందని జనసైనికులు వాపోతున్నారట .

Telugu Andhra Pradesh, Jagan, Janasena, Pawan, Pawan Kalyan, Tdp Pawan, Telugu D

ముఖ్యంగా పవన్ వెళ్తున్న ప్రతిచోట నాయకులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను తెలుగుదేశం అనుకూల మీడియా వ్యక్తీకరిస్తున్న తీరు చూస్తుంటే త్యాగాలు- జనసేనకు పదవులు- తెలుగుదేశంకు, అన్నట్లుగా ఉందని కొంతమంది హార్డ్ కోర్ జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .అయితే పవన్ కళ్యాణ్ ప్రథమ లక్ష్యం జగన్( jagan ) ప్రభుత్వాన్ని దించడమే తప్ప జనసేన ప్రభుత్వాన్ని స్థాపించడం కాదని ఈ ప్రయత్నంలో తెలుగుదేశానికి ఇరుసులా ఉపయోగపడాలని జనసేన అధ్యక్షుడి వాఖ్యలకు కొత్త అద్దాలు చెప్తున్న తెలుగుదేశం మీడియాని ఏలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితిలో జనసేన అభిమానులు, శ్రేణులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Telugu Andhra Pradesh, Jagan, Janasena, Pawan, Pawan Kalyan, Tdp Pawan, Telugu D

ఒకవైపు తెలంగాణలో 32 సీట్లకు పోటీ చేస్తామని చెప్పి ఎనిమిది సీట్లకు తనను తాను తగ్గించుకున్న జనసేన, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా తగ్గించుకుంటుందని కొంతమంది ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే రాజకీయం ఏ రాష్ట్రానిది ఆ రాష్ట్రాన్ని దేనని, తెలంగాణ ఆంధ్ర లెక్కలు వేరని, ఇక్కడ తాము చాలా బలంగా ఉన్నామన్నది జనసైనికులు లెక్క.జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీకి అనివార్యం కాబట్టి త్యాగాలు అంటూ చేస్తే తెలుగుదేశం పార్టీ చేయాలని జనసేన హార్డ్ కోర్ ఫాన్స్ వాదన .మరి ఈ సారికి పవన్ తగ్గుతారో లేక తగ్గిస్తారో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube