పవన్ కు బ్రెయిన్ వాష్ చేస్తున్న టిడిపి మీడియా?

తెలుగుదేశం, జనసేన ( Telugu Desam ,Janasena )ల పొత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమేనని, లక్షల మంది యువత భవిష్యత్తు కోసం ఈ రెండు పార్టీలు పొత్తు పేట్టుకున్నాయి తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పదేపదే చెబుతున్నారు.

ముఖ్యంగా రెండు పార్టీల నుంచి టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలను సర్దుకుపోమని ఒప్పించే దిశగా ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.

అయితే తెలుగుదేశం మీడియా మాత్రం కేవలం జనసైనికులను మాత్రేమే సర్దుకుపోమని పవన్ చెబుతున్నారని, ఈసారి రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము తగ్గితే వచ్చేసారి మనకు అవకాశం ఉంటుందని పవన్ చెబుతున్నారంటూ పేడార్ధాలు తీస్తుందని జనసైనికులు వాపోతున్నారట .

"""/" / ముఖ్యంగా పవన్ వెళ్తున్న ప్రతిచోట నాయకులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను తెలుగుదేశం అనుకూల మీడియా వ్యక్తీకరిస్తున్న తీరు చూస్తుంటే త్యాగాలు- జనసేనకు పదవులు- తెలుగుదేశంకు, అన్నట్లుగా ఉందని కొంతమంది హార్డ్ కోర్ జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

అయితే పవన్ కళ్యాణ్ ప్రథమ లక్ష్యం జగన్( Jagan ) ప్రభుత్వాన్ని దించడమే తప్ప జనసేన ప్రభుత్వాన్ని స్థాపించడం కాదని ఈ ప్రయత్నంలో తెలుగుదేశానికి ఇరుసులా ఉపయోగపడాలని జనసేన అధ్యక్షుడి వాఖ్యలకు కొత్త అద్దాలు చెప్తున్న తెలుగుదేశం మీడియాని ఏలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితిలో జనసేన అభిమానులు, శ్రేణులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

"""/" / ఒకవైపు తెలంగాణలో 32 సీట్లకు పోటీ చేస్తామని చెప్పి ఎనిమిది సీట్లకు తనను తాను తగ్గించుకున్న జనసేన, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా తగ్గించుకుంటుందని కొంతమంది ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది.

అయితే రాజకీయం ఏ రాష్ట్రానిది ఆ రాష్ట్రాన్ని దేనని, తెలంగాణ ఆంధ్ర లెక్కలు వేరని, ఇక్కడ తాము చాలా బలంగా ఉన్నామన్నది జనసైనికులు లెక్క.

జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీకి అనివార్యం కాబట్టి త్యాగాలు అంటూ చేస్తే తెలుగుదేశం పార్టీ చేయాలని జనసేన హార్డ్ కోర్ ఫాన్స్ వాదన .

మరి ఈ సారికి పవన్ తగ్గుతారో లేక తగ్గిస్తారో వేచి చూడాలి.

జైలులో పశ్చాతాపపడుతున్న దర్శన్.. రేణుకాస్వామి ఫ్యామిలీకి అలా సాయం చేయనున్నారా?