ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను టీడీపీ నేతలు కలిశారు.పోలీసుల తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
నారా లోకేశ్ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రచార రథాలు సీజ్ చేయడమే కాకుండా మైకులు కూడా లాక్కుంటారని గవర్నర్ కు తెలిపారు.
ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు గవర్నర్ ను కోరారు.







