టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు కృష్ణా జిల్లాలోని గన్నవరం కోర్టు ఎదుట హాజరు పరిచారు.ఈ క్రమంలో పట్టాభి వైద్య పరీక్షల రిపోర్టును కోర్టుకు సమర్పించారు.
అయితే నిన్నటి విచారణలో తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని పట్టాభి న్యాయమూర్తికి తెలిపినట్లు సమాచారం.ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ రిపోర్టును న్యాయస్థానం ముందు ఉంచారు పోలీసులు.
కాగా పట్టాభిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మరికాసేపటిలో పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారా లేదా అనే అంశంపై స్పష్టత రానుంది.







