Prabhakar Chowdary : పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే..సీటు త్యాగం చేస్తానంటున్న టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి..!!

2024 ఎన్నికలకు ప్రచారం మొదలుపెట్టడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రెడీ అయ్యారు.

ఈ క్రమంలో 2019 ఎన్నికలలో ఓటమి చెందిన భీమవరం నియోజకవర్గం నుండి ఫిబ్రవరి 14 తారీకు నుండి ప్రారంభించాలని భావించగా.

కార్యక్రమం వాయిదా పడింది.హెలికాప్టర్ ల్యాండింగ్ కి అనుమతి లభించలేదు.దీంతో మంగళగిరి ( Mangalagiri )పార్టీ ప్రధాన కార్యాలయంలోనే సమావేశాలు నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు.2024 ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో ముందుగా రెండు గోదావరి జిల్లాలలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించటానికి రెడీ అయ్యారు.

Tdp Leader Prabhakar Chowdary Who Says That If Pawan Kalyan Contests He Will Sa

అయితే అనుమతులు రాకపోవడంతో భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో చేపట్టాల్సిన సమావేశాలు పార్టీ కార్యాలయంలోనే నిర్వహించడానికి రెడీ అయ్యారు.ఈ ఎన్నికలను పవన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితులలో వైసీపీ( YCP ) గెలవకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే తన నియోజకవర్గమైన అనంతపురం అర్బన్ టికెట్ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి( Prabhakar Chowdary ) సంచలన ప్రకటన చేశారు.గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు.

Advertisement
Tdp Leader Prabhakar Chowdary Who Says That If Pawan Kalyan Contests He Will Sa

అసెంబ్లీలో తనకంటే పవన్ ఉండటమే అవసరమన్నారు.జనసేనానికి కుదరకపోతే తనకే టికెట్ ఇవ్వాలని.

ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడతానని ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు