ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.ఈ మేరకు ఈ నెల 17వ తేదీన టీడీపీ -జనసేన – బీజేపీ( TDP Janasena BJP ) ఉమ్మడి భారీ బహిరంగ సభ జరగనుంది.
చిలకలూరిపేటలో( Chilakaluripeta ) నిర్వహించనున్న ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) హాజరుకానున్నారు.ఈ క్రమంలో మోదీ పర్యటనను ప్రధానమంత్రి కార్యాలయం ఖరారు చేసింది.
అయితే పొత్తు నేపథ్యంలో మూడు పార్టీలు నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి బహిరంగ సభ కావడంతో పార్టీ నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.కాగా సభకు బస్సులను కేటాయించేందుకు ఏపీఎస్ఆర్టీసీ అంగీకారం తెలిపింది.మరోవైపు సభ నిర్వహణకు నేతలు 13 కమిటీలను నియమించారు.
మూడు పార్టీల్లోని నేతలతో కమిటీలను ఏర్పాటు చేశారు.సభ నిర్వహణ కమిటీ సభ్యులతో అచ్చెన్నాయుడు,( Atchennaidu ) లోకేశ్( Lokesh ) సమీక్ష నిర్వహిస్తున్నారు.