Nuzvid TDP : నూజివీడు టీడీపీలో హీట్..!!

ఏలూరు జిల్లాలోని నూజివీడు( Nuzvid ) టీడీపీలో పంచాయతీ రసవత్తరంగా మారింది.నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి( Kolusu Parthasarathy ) పేరును పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లే తెలుస్తోంది.

 Nuzvid Tdp : నూజివీడు టీడీపీలో హీట్..!!-TeluguStop.com

ఈ నెల 26వ తేదీన టీడీపీలో చేరేందుకు ఆయన సన్నాహాలు కూడా చేసుకుంటున్నారని సమాచారం.అయితే నూజివీడు అభ్యర్థిగా పార్థసారథిని నియమిస్తారన్న సమాచారం నేపథ్యంలో నియోజకవర్గ ప్రస్తుత టీడీపీ ఇంఛార్జ్ ముద్దరబోయిన( Muddaraboina Venkateswara Rao ) అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

ఈక్రమంలోనే పార్థసారథి చేరికను ఆయన వ్యతిరేకిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కార్యకర్తల అభిప్రాయాలను ఆయన తెలుసుకోవాలని భావిస్తున్నారు.పార్టీ శ్రేణుల ముందు కన్నీంటి పర్యంతమైన ముద్దరబోయిన ఈ విషయంపై తమ అధినేత చంద్రబాబుతో( Chandrababu ) చర్చించారు.ముద్దరబోయినను బుజ్జగించే బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, యనమలకు అప్పగించారు.

అయినప్పటికీ ఆయన టీడీపీ హైకమాండ్ పై అసంతృప్తిగానే ఉన్న నేపథ్యంలో నూజివీడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube