నేడు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు( MLC Elections ) జరగనున్నాయి.మొత్తం ఏడు స్థానాలకు గాను ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
టిడిపి ( TDP ) ఈ ఎన్నికల్లో ఒక స్థానానికి పంచుమర్తి అనురాధను అభ్యర్థిగా నిలబెట్టింది.వాస్తవంగా ఈ ఏడు స్థానాల్లో ఒక స్థానం టిడిపికి దక్కాల్సి ఉంది.
కానీ టిడిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు నలుగురు వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నారు.దీంతో టీడీపీకి ఒక అభ్యర్థిని గెలిపించుకునే బలం లేదు.
అయితే అధికార ప్రతి వైసీపీకి( YCP ) చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రెబల్ గా మారారు.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరు వైసీపీకి దూరంగా ఉంటున్నారు.
దీంతో వారి రెండు ఓట్లను కలుపుకుంటే టిడిపికి ఒక్క ఓటు అవసరం అవుతోంది.

అయినా టిడిపి వైసిపి ఎమ్మెల్యేలు అసంతృప్తులు ఇంకా ఉన్నారని , వారిలో కొంతమంది అయినా , తమ అభ్యర్థికి ఓటు వేస్తారనే నమ్మకంతో ఉంది .అందుకే ఆ ధీమాతో అభ్యర్థిని నిలబెట్టింది.వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ కొంతకాలం క్రితమే వైసిపి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.
ఆ సమావేశంలోనే పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలను హెచ్చరించారు.కొంతమందికి టికెట్లు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు.
దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కే అవకాశం లేదని భావిస్తున్న కొంతమంది ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

ఇప్పుడు అటువంటి వారు ఎవరైనా టిడిపికి అనుకూలంగా ఓటు వేస్తే, తమకు ఒక్క స్థానం దక్కుతుందనే నమ్మకంతో టిడిపి ఉంది.ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించడంతో, మంచి ఉత్సాహంతో ఆ పార్టీ ఉంది.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ సీరియస్ గా తీసుకోకపోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ విధమైన తప్పిదం చోటు చేసుకోకుండా , ముందుగానే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో రెండు మూడు సార్లు మాక్ పోలింగ్ ను చేపట్టారు.ఇక ఈరోజు జరగబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో అనే టెన్షన్ రెండు పార్టీల నేతల్లోనూ నెలకొంది.
ఉద్దేశ పూర్వకంగా కాకపోయినా, పొరపాటునైనా వైసీపీ ఓట్లు తమకు పడతాయనే ఆశతో టిడిపి ఉంది.