టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి మండిపడ్డారు.టీడీపీ మునిగిపోతున్న నావని చెప్పారు.
చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు.సీఎంగా చంద్రబాబు 14 సంవత్సరాలు ఏం చేశారని ప్రశ్నించారు.
మీరు చెత్త పాలన చేశారు కాబట్టే ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని తెలిపారు.ఏపీలో టీడీపీ భవిష్యత్ లేదని చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్యేలను ఓడించే సత్తా చంద్రబాబుకు ఉందా అని అంబటి ప్రశ్నించారు.ఆంబోతులకు ఆవులను సప్లై చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు.







