అమరావతి: అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు.సమావేశాలు బహిష్కరించిన టీడీపీ. ప్రశ్నోత్తరాలు తో ప్రారంభం కానున్న అసెంబ్లీ.9 బిల్లులకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ.ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లు,ఏపీజీఎస్టీ సవరణ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసే చట్ట సవరణ బిల్లు,ఏపీ మోటార్ వెహికల్స్ ట్యాక్సెస్ సవరణ బిల్లులకు ఆమోదం తెలపనున్న సభ.
ఏపీ రవాణా వాహనాలు పన్నుల చట్టంలో రెండో సవరణ బిల్లు,ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్లు,ఏపీ భూదాన్, గ్రామదాన్ సవరణ బిల్లు,హిందూ ధార్మిక చట్టం సవరణ బిల్లు,ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లులకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ.బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనున్న అసెంబ్లీ.అసెంబ్లీలో మహిళా సాధికారత, అసైన్డ్ ల్యాండ్స్-భూముల రీసర్వే పై స్వల్పకాలిక చర్చ.