ఎన్టీఆర్ జిల్లా – జి.కొండూరు: జి.కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం.ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.
దేవినేని ఉమామహేశ్వరరావు కామెంట్స్… వైసీపీ అధికారంలోకి వచ్చి, జగన్ పాలన చూసాక ప్రజలు మాకు ఇదేం ఖర్మ అనుకుంటున్నారు.
వైసీపీ నాయకులు మట్టి, ఇసుక, బూడిద ను అమ్ముకొని కోట్లు గడిస్తున్నారు.
పట్టిసీమ పంపు లకు బూజు పట్టించిన ఘనత వైసీపీ కే దక్కుతుంది.పోలవరం పరిశీలన కు వెళుతుంటే లారీలు అడ్డంపెట్టి చంద్రబాబు ను అడ్డుకున్నారు.చంద్రబాబు ప్రజల్లోకి వస్తుంటే వైసీపీ ప్రభుత్వంకు వణుకు పుడుతుంది.14 సమస్యలను తీసుకొని ప్రజల్లోకి వెళుతున్నాం.ప్రజలు చెప్పిన సమస్యలను రాసుకొని టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కరిస్తాం.