తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మీడియా సమావేశం.పోలవరానికి జగనే శని.
రాయలసీమ ద్రోహిగా ఇరిగేషన్ ప్రాజెక్టులను జగన్ రెడ్డి నాశనం చేశాడు.రాయలసీమ కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని నిలదీస్తే ముఖ్యమంత్రి ఎందుకు సమాధానం చెప్పడం లేదు.
మీరు ఖర్చుపెట్టిన 15 వేల కోట్లలో ఏ ప్రాజెక్టులో అయినా నీళ్లు ఇచ్చారా ? ఎన్ని పూర్తి చేశారో చెప్పండి.టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసిన సంఘం, నెల్లూరు బ్యారేజీలకు మీ పేర్లు పెట్టుకున్నారు.
గత ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులకు మీ పేర్లు పెట్టుకోవడం తప్ప మీరు ఉద్ధరించింది ఏమైనా ఉందా.మా ఐదేళ్ల హయాంలో ఏం చేశామన్నది సాగునీటి విషయాలు చరిత్ర మా దగ్గర ఉంది.
దేవినేని ఉమా చెప్పింది కాదు ఇదంతా ప్రభుత్వ రికార్డుల్లో ఉంది ఇది చూసిన మీరు సిగ్గు తెచ్చుకోండి.రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రం తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరు పనులు చేశారు ప్రతివారం సోమవారం పోలవరం పనులు చేయించి ఆన్లైన్లో పెట్టడం జరిగింది.
ఏ డబ్బులు ఎక్కడ వచ్చాయి ఎంత ఖర్చు పెట్టాం ఏం చేయాలి అన్నది 82 వారాలు రివ్యూ చేసి 28 సార్లు పోలవరం పర్యటన చేశారు.
ఇరిగేషన్ మంత్రులు జోకర్లు బఫూన్లు అయ్యారు.
బుల్లెట్ దిగుద్ది… పర్సంట ఆర పర్సెంటా అన్నాడు దిక్కులేడు సంబరాల రాంబాబు రికార్డింగ్ డాన్స్ లు చేసుకుంటున్నాడు.చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులు సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ప్రభుత్వానికి బట్టలూడదీశాడు.198 ప్యాకేజీలను నిర్ధాక్షణంగా రద్దు చేశారు ఐదేళ్ల వరకు టెండర్లు పిలవద్దన్నారు.ఈ నాలుగేళ్లలో ఏ డబ్బులు ఎటు వెళ్లి ఎంత తిన్నారు ? జూలైలో వరద వస్తే నిర్వాసితులకు కావలసిన జాగ్రత్తలు తీసుకోండి మంచినీళ్లు ఏర్పాటు చేయండి లాంచీలు, మర పడవలు పెట్టండి అని చెబితే ముఖ్యమంత్రికి సోయలేదు.బుడమేరులో బ్రిడ్జి కట్టారు ఈ దరిద్రులకు నేను చెప్పాను ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఏం జరుగుతుందో ప్రస్తుతం చూస్తున్నాం.బాధ్యత గల వైసీపీ నాయకులకు ఇంతవరకు మీడియా సమావేశం పెట్టి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా?
జోగి రమేష్ కు బుద్ధి జ్ఞానం ఉందా బూతులు మాట్లాడడానికా మీరు మంత్రులు అయింది ? వెలగలేరు ముత్యాలంపాడుల్లో జగన్ అన్న ఇళ్ళు 5 అడుగుల లోతులో ఉన్నాయి.జగన్ రెడ్డి గారు జగన్ అన్న సెంటు పట్టాతోపాటు జగనన్న పడవకు కూడా బటన్ నొక్కండి ఎన్ని లక్షల పట్టాలిచ్చారు ఎన్ని లక్షల పదవులు ఇస్తారు.సెంటు పట్టా, మెరక పనులపై జగన్ రెడ్డి సిబిఐ విచారణకు ఇస్తే 45 మంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్లడం ఖాయం.
మీరా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్, పవన్ కళ్యాణ్, ఈనాడు ఈటీవీ రామోజీరావు ఆంధ్రజ్యోతి ఏబీన్ రాధాకృష్ణ, టీవి 5 నాయుడు గారి గురించి మాట్లాడేది ? పోలవరంలో నిర్వాసితులకు ఎంత ఖర్చు పెట్టారు చెప్పమంటే అంబటి రాంబాబు బెబ్బ బెబ్బ బెబ్బ అంటున్నాడు.
కాంట్రాక్టర్ను మార్చవద్దని పోలవరం అథారిటీ అధికారులు చెబితే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా మార్చేశారు.
ప్రోటోకాల్ అంటూ బుద్ధిలేని రాంబాబు మాట్లాడుతున్నాడు పోలవరానికి 11,537 కోట్లు డబ్బులు కేంద్రం ఎలా ఇస్తుంది దానికి అనుగుణంగా పోలవరం 72% పనులు ముందుకు తీసుకువెళ్లారు?2009 ఆగస్టులో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు పిలిపించుకొని ప్రీ క్లోజర్ చేయించారు.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయం వల్ల 2500 కోట్లు అదనపు భారం పడింది.1574 కోట్ల కాంట్రాక్టు మళ్లీ రద్దు చేశారు గైడ్ బండు మళ్లీ కుంగిపోయింది ! జారిపోయింది !కుంగింది గైడ్ బండ్ కాదు జగన్ ప్రభుత్వ ప్రతిష్ట.A10, A 11 పేర్లు బయటికి వస్తే తాడేపల్లి కొంప షేక్ అవుతుంది.బుద్ధిలేని అధికారి ఈరోజు మాట్లాడుతున్నారు వాంగ్మూలం తప్పుగా రికార్డు చేశారు అంట !
అజయ్ కల్లాం రెడ్డి ఐఏఎస్ అధికారిగా ఎలా పని చేశారు ? మళ్లీ కోర్టులో కేసు ఎలా వేస్తారు ? పల్లెటూర్లలో బొంకులు దాగవు అనే సామెతలు ఉన్నాయి.నారాయణ గారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ధైర్యంగా మాట్లాడుతున్నారు చేసిన పనిని చెప్తున్నారు.
ఈరోజు దిగజారిపోయి వ్యక్తిత్వ హననం చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు రాతలతో బురద జల్లి క్యారెక్టర్ అసాసినెట్ చేస్తారా? ఒక్క ఛాన్స్ అని మోసం చేశావు లక్షల కోట్లు దోచేశావు.విష పురుగులు లాంటి వైసిపి నేతలను, ప్రభుత్వాన్ని బయటకు రాకుండా ప్రజలు భూస్థాపితం చేసి కాంక్రీట్ చేస్తారు.