Chandrababu Praja Galam : ‘ ప్రజాగళం’ తో బాబు ఆ విధంగా ముందుకు…

రాబోయే ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు( TDP Chief Chandrababu Naidu ) సరికొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

ఎన్నికల ప్రచారం చేపట్టి, అధికార పార్టీ వైసీపీని గద్దె దింపాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు.

దీనిలో భాగంగానే ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు మరో కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు.ఈ మేరకు మార్చి 6 నుంచి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్ళనున్నారు.

ప్రజా గళం( Praja Galam ) పేరుతో ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.మార్చి 6 నుంచి వరుసగా ఐదు రోజులపాటు ప్రజాగాళం కార్యక్రమాలు జరగనున్నాయి.

మొదటి రోజు ఉదయం నంద్యాల, మధ్యాహ్నం మైదుకూరులో ప్రజా గళం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.

Advertisement

మార్చి 4 రాప్తాడు సభతో చంద్రబాబు రా కదలిరా సభలు( Raa Kadali Raa ) ముగిబోతున్నాయి.ఆ తరువాత ప్రజా గళం పేరుతో చంద్రబాబు ప్రజల్లోకి రాబోతున్నారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చే విధంగా భారీ స్థాయిలో చంద్రబాబు సభకు జనాలు తరలి వచ్చే విధంగా టిడిపి ప్లాన్ చేస్తోంది.

ముఖ్యంగా వైసీపీ( YCP )కి గట్టి పట్టు ఉన్న ప్రాంతాల్లో ఈ సభలను నిర్వహించడం ద్వారా, ఆ పార్టీపై పట్టు సాధించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.జనసేన పార్టీ తో కలిసి ఉమ్మడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నారు.వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను హైలెట్ చేసి, జనాల్లో దానిపై చర్చ జరిగే విధంగా, టిడిపి జనసేన కూటమి( TDP-Janasena )కి అది కలిసి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం తాడేపల్లిగూడెంలో జనసేన తో కలిసి నిర్వహించిన జెండా సభ విజయవంతం కావడంతో, టీడీపీ జనసేన శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగిందని బాబు అంచనా వేస్తున్నారు.అదే ఉత్సవం ఎన్నికల వరకు కార్యకర్తల్లో ఉండేలా, నిరంతరం ఏదో ఒక కార్యక్రమం తో జనాల్లోకి వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు.ముఖ్యంగా జనసేన పార్టీతో కలిసి భారీ బహిరంగ సభలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోను చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

బిజెపితో పొత్తు( BJP ) విషయంలో మరింత క్లారిటీ వచ్చిన తర్వాత ఇక దూకుడుగా వ్యవహరించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పర్యటనలు ఉండే విధంగా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు