అమిత్ షాతో చంద్ర‌బాబు భేటీ.. ఎందుకంటే?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉందని రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సమావేశం జరగనుంది.

నల్గొండ జిల్లా ముగుగోడు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలో అమిత్ షా ఆగాల్సి ఉంది.ఇవాళ‌ మునుగోడులో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించాల్సి ఉండగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఆగనున్నారు.రామోజీరావుతో కేంద్ర మంత్రి కొద్దిసేపు సమావేశమవుతుండగా, అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.2024 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు కోసం టీడీపీ, బీజేపీ మద్దతుదారులలో గట్టి పట్టుదల ఉంది.బీజేపీ, టీడీపీ, జనసేన అనే మూడు పార్టీల మధ్య పొత్తు కోసం జనసేన కూడా ఒత్తిడి చేస్తోంది.

అమిత్ షాతో భేటీ సంద‌ర్భంగా త‌న కోరిక‌ను చంద్ర‌బాబు ఆయ‌న వ‌ద్ద వ్య‌క్తం చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు మీడియా ప‌రంగా స‌హ‌క‌రించాల్సిందిగా అమిత్ కోర‌తార‌ని చెప్పుకుంటున్నారు.

మ‌రో వైపు గ‌త సార్వ‌త్రిక ఎన్నికల‌కు ముందు బీజేపీతో తెగ‌దెంపులు న‌చేసుకుని అప్ప‌టి నుంక‌చి బీజేపీతో ఉప్పూనిప్పుగా వ్య‌హ‌రిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్య‌వ‌హార‌శైలి ఇటీవ‌ల కాలంలో మారింద‌ని అంటున్నారు.

Advertisement

ఈ నేప‌థ్యంలో బీజేపీతో మ‌ళ్లీ పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాల‌నేది చంద్ర‌బాబు ప్లాన్ అని చెబుతున్నారు.అలాగే పార్ల‌మెంటులో వివిధ బిల్లులు ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు కూడా టీడీపీ, బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింద‌ని విశ్లేష‌కులు గుర్తు చెస్తున్నారు.2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను ఓడించాల్సిన అవసరాన్ని ఇటీవల వైఎస్‌ చౌదరి నొక్కి చెప్పారు.బీజేపీ కూడా 29 రాజధాని గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో వైఎస్ చౌదరి జోక్యంతో రామోజీరావు చొరవ తీసుకున్నారని, అమిత్ షా, చంద్రబాబు నాయుడుల మధ్య భేటీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.మరి ఈ భేటీ జరుగుతుందా లేక ఊహాజనిత వార్తగా మిగిలిపోతుందా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు