అనకాపల్లి: ఉచిత కరెంటు అని చెబుతూ… పంపుసెట్లకు మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు?.విలేకరులకు పంపిన వీడియోలో ప్రభుత్వ తీరును విమర్శించిన మాజీ మంత్రి అయ్యన్న.
రైతులకు చెప్పాల్సిన భాద్యత ప్రభుత్వానిక లేదా?.విద్యుత్ నష్టాన్ని అరికట్టాల్సింది పోయి, ఇటువంటి చర్యలకు పాల్పడటం దారుణం.
తుగ్లక్ పాలనలో రైతులు నాశనం అవుతున్నారు.ఎరువులతో పాటు క్రిమిసంహారక మందుల ధరలు పెరిగాయి.
రాయితీలు దాదాపుగా అన్నీ తగ్గించేస్తున్నారు.అన్ని పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రత్యేక మీటర్లు ఏంటి? రైతులకు వివరించాల్సిన భాద్యత ప్రభుత్వానికి ఉంది.
ప్రత్యేకంగా వారితో సమావేశాలు ఏర్పాటు చేయాలి.వారి ఆమోదం పొందిన తరువాత మీటర్లు బిగించాలి.అప్పుల కోసమే మీటర్లు బిగిస్తున్నారు.తెలంగాణా, తమిళనాడు, కర్ణాటకల్లో వ్యతిరేకిస్తుండగా, మన రాష్ట్రంలో ఎందుకు అమర్చుతున్నారు? మోడీకి భయపడుతున్నారా? దీనిపై అందరూ వ్యతిరేకించాలి.







