TDP Kalalaku Rekkalu : ఇంటర్ చదివిన… విద్యార్థినిలు, మహిళలకు.. టీడీపీ సరికొత్త పథకం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి చంద్రబాబు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు.

వైసీపీ మరోసారి అధికారంలోకి రాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.ఈ క్రమంలో జనసేన పార్టీతో పొత్తు( TDP Janasena Alliance ) పెట్టుకోవడం జరిగింది.

అంతేకాకుండా బీజేపీతో కూడా కలిసి అడుగులు వేస్తున్నారు.రాష్ట్ర విభజన జరిగినా అనంతరం 2014లో ఏర్పడిన కూటమిని 2024లో రిపీట్ చేసి గెలవాలని భావిస్తున్నారు.

ప్రచారం విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ అదేవిధంగా నారా భువనేశ్వరి పాల్గొంటున్నారు.

Advertisement

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చేపట్టిన "నిజం గెలవాలి"( Nijam Gelavali ) పేరిట నారా భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్నారు.చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ సాయం చేస్తున్నారు.అయితే శుక్రవారం మహిళా దినోత్సవం( Womens Day ) సందర్భంగా కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించడం జరిగింది.

ఈ సందర్భంగా ఇంటర్ పూర్తీ చేసిన మహిళలకు చదువుతున్న విద్యార్థినీలకు  నారా భువనేశ్వరి శుభవార్త తెలిపారు.ఇంటర్ పూర్తి చేసుకుని ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే వారికీ  ప్రభుత్వ గ్యారెంటీతో బ్యాంకు లోన్ ఇప్పించనున్నట్లు స్పష్టం చేశారు.

విద్యార్థినీలు చెల్లించాల్సిన బ్యాంకు వడ్డీని పూర్తిగా టీడీపీ-జనసేన ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు."కలలకు రెక్కలు"( Kalalaku Rekkalu ) పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

ఈ పథకానికి ఇంటర్ చదివిన విద్యార్థులు, మహిళలు అర్హులని స్పష్టం చేశారు.

వారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది .. కేటీఆర్ సెటైర్లు 
Advertisement

తాజా వార్తలు