Rajanna Sircilla : పారుకం కాలువల తో పాటు మోటార్లు కూడా నడిపించుకోవాలి : ఒగ్గు బాలరాజు యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట,నారాయణపూర్, కోరుట్లపేట,సర్వాయిపల్లె గ్రామాల ఆయకట్టు కు సాగు నీటిని అందించే సింగ సముద్రం లో ప్రస్తుతం 16ఫీట్ల నీరు మాత్రమే ఉందని కాబట్టి రైతులు పారుకం కాలువల( Parukam Kaluva ) నీటిని పంట కాలువలకు పెట్టుకుంటు మీమీ బోర్ మోటార్ లను సైతం నడిపించుకోవాలని సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ రైతులను కోరారు.ప్రస్తుతం వరి పంట పొలాలు పొట్ట దశలో ఉన్నాయని రైతులు పారుకాం కాలువలు,బోర్ మోటార్ లు నడిపించుకుంటే పొలాలు సమృద్దిగా పండుతాయని బాలరాజు యాదవ్ అన్నారు.

 Along With Canals Motors Should Also Be Run Says Oggu Balaraju Yadav-TeluguStop.com

ప్రస్తుతం ఎల్లారెడ్డి పేటలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో పంటలు ఎండిపోతున్నాయని రైతులు బాలరాజు యాదవ్( Balaraju Yadav ) దృష్టికి తీసుకు రాగ సముద్రం నీరటి లతో కలిసి వెళ్ళి ఆయన పరిశీలించారు.ఎగువ మానేర్ నుండి సింగ సముద్రంలోకి ఒక ఆరు ఫీట్ల నీటిని విడుదల చేయాలని ఎగువ మానేర్ డి ఈ నీ కోరినట్లు ఆయన తెలిపారు.

ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట సింగ సముద్రం నీటి సంఘం మాజీ అధ్యక్షుడు నేవూరీ బాలయ్య గారి గోపాల్ రెడ్డి, రాగుల తిరుపతి రెడ్డి సముద్రం నీరటిలు మ్యాకల శరవింద్, ఎనగందుల సత్యనారాయణ, ఎనగందుల దేవయ్య లు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube