అధికారంలో ఉన్న పార్టీకిలోకి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు జంపింగ్ చేయడం సహజం.అధికార పార్టీలు కూడా వద్దనకుంటా చేర్చుకుంటాయి.
అవసరమైతే కీలక బాధ్యతలు అప్పగిస్తాయి.అందలం ఎక్కిస్తాయి.
దీంతో అప్పటికే పార్టీలో ఉన్న నేతలు ప్రాధాన్యం దక్కక అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.ఇలా చేర్చుకోవడం వెనుక కారణం ఏంటంటే ప్రతిపక్షాన్ని బలహీన పరచడం.
ఆ పార్టీని అంతం చేయాలనే ఉద్దేశంతో ఇలా చేయడం ఇదంతా తెలిసిందే.ఇక ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చేసిందే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ చేస్తోంది అదే.ఈ రెండు పార్టీలు కూడా అధికారంలో ఉండగా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు చాలానే ఉత్సాహం చూపించాయి.అయితే.
దీనివల్ల సాధించింది ఏంటి.? తాత్కాలిక ఫలితం తప్పా మరేమి లేదనే చెప్పాలి.
అప్పుడు టీడీపీ…
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలను లాగేసుకుంది.అంతేకాదు వారికి మంత్రి పదవులు కట్టబెట్టింది.
అయితే వీరిలో ఒకరిద్దరు తప్ప ఇతర నాయకులు ఎవరూ కూడా పార్టీకి అండగా నిలిచింది లేదు.పైగా వీరి రాకతో పార్టీలో ఉన్న నేతల్లో అసంతృప్తి.
లేనిపోని ఇబ్బందులు వచ్చాయి.సొంత పార్టీ నాయకులను పక్కన పెట్టి వీరికి టికెట్లు ఇవ్వడం వల్ల సమస్యలు ఎదురయ్యాయి.
పోనీ పార్టీ అధికారంలో లేనప్పుడు.వీరు పార్టీకి ఏమైనా చేస్తున్నారా.? అంటే అదీలేదు.

దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ.తీవ్ర విమర్శలు వచ్చాయి.ఇక ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
టీడీపీ నుంచి తీసుకున్న నలుగురు ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రాధాన్యం లేదు.
వారికి అసలు గుర్తింపే లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది.
కనీసం గతంలో అయినా మంత్రి పదవులు దక్కాయి.కానీ ఇప్పుడు పేరుకే ఎమ్మెల్యే అనే విధంగా ఉంది పరిస్థితి.
పైగా నియోజకవర్గాల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య తీవ్ర వివాదాలు.వ్యతిరేకత.
టికెట్ల రగడలు పెరిగిపోయాయి.ఈ పరిణామాలను గమనిస్తే.
జంపింగులతో పార్టీలకు ఒరిగింది ఏమీ లేదు.నిజానికి అప్పట్టో వైసీపీని ఏదో చేయాలని అనుకున్న టీడీపీ సాధించింది ఏమీ లేదు.
ఇక ఇప్పుడు టీడీపీని లేకుండా చేయాలని అనుకున్న వైసీపీ సాధించింది కూడా ఏమీ కనిపించడం లేదు.కానీ జంపింగులను ప్రొత్సహిస్తున్న పార్టీలే చులకన అవుతున్నాయి.