టీడీపీ కీలక నేత మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అనూహ్య పరిణామాల మధ్య అర్ధరాత్రి అరెస్టయ్యారు.తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు.
ఆ సమయంలో ఈఎస్ఐ లో భారీ ఎత్తున ఆయన కుంభకోణానికి పాల్పడిన ట్లుగా వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంలో అచ్చెన్న భారీ ఎత్తున కుంభకోణానికి పాల్పడినట్లుగా అనేక సాక్ష్యాధారాలను ఏపీ ప్రభుత్వం సంపాదించింది.ఈ మేరకు అప్పట్లోనే ఈ వ్యవహారంపై అచ్చెన్న పై కేసు నమోదు చేశారు.
అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద సంచలనం సృష్టించింది.ఇక ఆ తర్వాత ఈ వ్యవహారం ను పెద్దగా పట్టించుకోనట్లు కనిపించినా, అనూహ్యంగా ఇప్పుడు అచ్చెన్నాయుడు ను అధికారులు శ్రీకాకుళం జిల్లాలోని ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన వెంటనే ఆయన్ను విజయవాడ కు తరలించినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా వందలమందితో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

ఈఎస్ఐ లో లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్ తీసుకుని అచ్చెన్న వత్తిడితో ఆర్డర్లు ఇచ్చినట్లుగా విజిలెన్స్ విచారణలో తేలింది.నామినేషన్ పద్ధతిలో టెండర్లు ఇప్పించారని, టెలీ హెల్త్ సర్వీసెస్ పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్న అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది.అలాగే నామినేషన్ పద్ధతిలో టెలి మెడిసిన్ ల్యాబ్ కు కాంట్రాక్ట్ అందజేయాలని కోరుతూ అచ్చెన్నాయుడు అప్పట్లో ఈఎస్ఐ డైరెక్టర్ రవి కుమార్ కు లేఖ రాసినట్టుగా విజిలెన్స్ పేర్కొంది.
ఎటువంటి కొటేషన్ లేకుండా, నామినేషన్ పద్ధతిలో సర్వీస్కు కాంట్రాక్ట్ ఇచ్చినట్లుగా తన నివేదికలో పేర్కొంది.అప్పట్లో ఈ వ్యవహారంపై మరో మంత్రి పితాని సత్యనారాయణ పేరు కూడా తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.టెలి హెల్త్ సర్వీసెస్ ఏపీ కంటే ముందు తెలంగాణలోని ప్రారంభించారని, తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ అమలు చేయాలని తాను నోట్ పంపించాను తప్ప వారికి ఇవ్వాలని ఎటువంటి ఒత్తిడి చేయలేదని, గతంలోనే అచ్చెన్న ప్రకటించారు.కానీ విజిలెన్స్ నివేదిక మేరకు ఇప్పుడు ఏసీబీ ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపేలా కనిపిస్తోంది.ఇప్పటికే దీనిపై టిడిపి తీవ్రస్థాయిలో ఏపీ ప్రభుత్వంపై విరుచుకు పడుతోంది.