Movie Title: టాక్సీవాలాCast & Crew:నటీనటులు:విజయ్ దేవరకొండ,ప్రియాంక జువాల్కర్,మాళవిక నాయర్ తదితరులు దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యాన్నిర్మాత:గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్సంగీతం: జెక్స్ బిజయ్
STORY:
నిరుద్యోగి శివ (విజయ్ దేవరకొండ) ఎన్నో చిన్న ఉద్యోగాలు చేసి మధ్యలో మానేసి చివరికి ఒక కార్ ని సెకండ్ హ్యాండ్ లో కొనుక్కుంటాడు.ఆ కార్ ని క్యాబ్ లాగ తిప్పుతుంటాడు.
ఓ సారి తన క్యాబ్ ఎక్కిన అమ్మాయి (ప్రియాంక) తో ప్రేమలో పడతాడు.ఇంతలో తన కార్ లో ఒక వింత సంఘటన జరుగుతుంది.
ఒక దయ్యం తన కార్ ఎక్కిన ఒక పాసెంజర్ ప్రాణాలు తీసేస్తుంది.అసలేం జరుగుతుందో తెలుసుకోడానికి శివ తన ఫ్రెండ్స్ తో కలిసి కార్ మాజీ ఓనర్ ను కలవడానికి వెళ్తాడు.
అప్పుడే శిశిర (మాళవిక) కు జరిగిన అన్యాయం గురించి తెలుస్తుంది.అసలు శిశిరకు జరిగిన అన్యాయం ఏంటి? చివరికి శివ ఎలా ఎదురుకున్నాడు అనేవి తెలియాలంటే టాక్సీవాలా సినిమా చూడాల్సిందే.!
REVIEW :
‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా చిత్రంతో మరోసారి హిట్ కొట్టే ప్రయత్నం చేసారు.విడుదలకు ముందే పైరసీ భూతం ఈ చిత్రాన్ని కమ్మేయడంతో ‘టాక్సీవాలా’కు బ్రేక్ పడినట్టైంది.విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రంతో రాహుల్ సంక్రిత్యాన్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు.
సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ టాక్సీడ్రైవర్‌గా కనిపించారు.
బతకుతెరువు కోసం టాక్సీడ్రైవర్‌గా మారిన చదువుకున్న యువకుడి కథే ‘టాక్సీవాలా’.అయితే తానే ఎంచుకున్న వృత్తిలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు.టాక్సీతో పాటు ఓ పాసింజర్ వల్ల అతడి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి లాంటి ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
తమిళ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది.ముఖ్యంగా ‘మాటే వినదుగా’ అనే సాంగ్ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగితూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది.డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్.
సాయి కుమార్ రెడ్డి డైలాగ్స్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి.
Plus points:
ఫస్ట్ హాఫ్విజయ్ దేవరకొండకామెడీ
Minus points:
క్లైమాక్స్సెకండ్ హాఫ్
Final Verdict:“టాక్సీవాలా” ఆడియన్స్ ని ఆకట్టుకునే థ్రిల్లర్.(ఒక్క క్లైమాక్స్ అరగంట తప్ప)
Rating: 2.5/5