వినాయక పందిరికి పన్ను వేయడం హేయమైన చర్య... బోండా ఉమామహేశ్వరరావు

వినాయక పందిరికి రోజుకు రూ.వెయ్యి పన్ను కట్టమనటం హేయమైన చర్య అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు.

 Taxing Ganesha Canopy Is A Heinous Act , Bonda Umamaheswara Rao,tdp Polit Bureau-TeluguStop.com

పనికిమాలిన నిబంధనలు పెట్టి రాష్ట్రంలో వినాయక చవితి పండుగని నిర్వీర్యం చేయ్యాలని జగన్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు.వినాయక పందిరికి రోజుకు రూ.వెయ్యి పన్ను కట్టాలనటం హేయమైన చర్య అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు.పనికిమాలిన నిబంధనలు పెట్టి రాష్ట్రంలో వినాయక చవితి పండుగ జరగకుండా చేయాలని చూస్తున్నారన్నారు.

హిందూమతం మీద జగన్​ రెడ్డి సాగిస్తున్న కక్ష సాధింపులో భాగంగానే చవితి వేడుకలకు అనేక నిబంధనలు పెట్టారని మండిపడ్డారు.పండుగలపై జగన్​ రెడ్డి పెత్తనం ఏంటని నిలదీశారు.

పనికిమాలిన జీవోలు రద్దు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బోండా ఉమ హెచ్చరించారు.పడుగలెలా చేసుకోవాలో కూడా ప్రభుత్వమే శాసించేలా జగన్ తుగ్లక్ పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వినాయక చవితి పండుగ సంప్రదాయాలకు తగ్గట్లు కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు జరపాలనటం దుర్మార్గమన్నారు.అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ హిందూ దేవాలయాలపై వరుస దాడులు కొనసాగించారని దుయ్యబట్టారు.

పిచ్చోడి చేతిలో రాయిలా జగన్​ పాలన ఉందని విమర్శించారు.తుగ్లక్ నిబంధనలకు భయపడకుండా ప్రజలు వినాయక చవితి పండుగ నిర్వహించుకుంటే అందుకు టీడీపీ అండగా ఉంటుందని బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube