సరికొత్త వ్యాపారంలోకి టాటా గ్రూప్ ఎంట్రీ.. బిస్లేరీలో వాటాల కొనుగోలుకు ఆసక్తి!

ప్రముఖ దేశీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌ ఎప్పటి కప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతోంది.ఈ క్రమంలో తాజాగా ప్యాకేజ్డ్‌ వాటర్‌ కంపెనీ ‘బిస్లరీ ఇంటర్నేషనల్‌’లో వాటాలు దక్కించు కోవడంపై దృష్టిని కేంద్రీకరించింది.

 Tata Group Interested To Buy Shares In Bisleri Details, Tata Group, New Busines-TeluguStop.com

ముందుగా కొంత కొనుగోలు చేసి, క్రమంగా వాటాలు పెంచుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇందుకు సంబంధించి బిస్లరీ యాజమాన్యానికి TCPL (టాటా గ్రూప్‌ సంస్థ టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌) ఇప్పటికే ఆఫర్‌ ఇచ్చినట్లు సంబంధిత వర్గాల ద్వారా విషయం బయటకు తెలిసింది.

అయితే డీల్‌ కుదిరితే గాని విషయం ఇప్పుడే చెప్పలేమని ఈ సందర్భంగా చెప్పడం కొసమెరుపు.ఈ డీల్ కుదిరితే, వేగంగా విస్తరిస్తున్న బాటిల్ వాటర్ మార్కెట్‌లో పోటీ పడేందుకు టాటా గ్రూప్‌నకు చెందిన FMCG విభాగానికి ప్రీమియం సెగ్మెంట్‌లో పట్టు లభించినట్టేనని పరిశీలకులు పేర్కొన్నారు.

కాగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇప్పటికే హిమాలయన్ బ్రాండ్‌తో ప్యాకేజ్ చేయబడిన మినరల్ వాటర్‌ను, హైడ్రేషన్ విభాగంలో టాటా కాపర్ ప్లస్ వాటర్, టాటా గ్లూకో+ వంటి బ్రాండ్‌లతో విక్రయిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Bottle, Fellows, Latest, Ratan Tata, Tata-General-Telugu

టాటా గ్రూప్ ఇటీవల వృద్ధులకోసం ఓ స్టార్తప్ ని స్టార్ట్ చేసిన సంగతి మీలో ఎంతమందికి తెలుసు? ఇక్కడ లాభాపేక్షతో కాకుండా మానవీయ కోణంలో రతన్ టాటా ఈ ఆలోచన చేసారు.ఒంటరిగా బతుకులు వెళ్లదిస్తూ.తమకోసం ఎవరూ లేక, తాము ఎవరికీ పట్టక తమలో తామే కుమిలిపోయే సీనియర్ సిటిజన్ల కోసం ఓ స్టార్టప్ సంస్థను ప్రారంభించారు.

“గుడ్ ఫెలోస్” పేరుతో ఈ స్టార్టప్ సంస్థ ఇప్పటికే ముంబైలో ప్రారంభమైంది.ముంబైలో పైలట్ ప్రాజెక్టు మాదిరిగా 20 మంది వృద్ధులకు సపర్యలు చేస్తూ.వారికి శేష జీవితం ఎంతో ఆనందంగా సాగేలా ప్రాజెక్టు పనిచేస్తోంది.తదుపరి ఫేజ్ లో పుణే, చెన్నై, బెంగళూరుల్లో సేవలు ప్రారంభిస్తామన్నారు రతన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube