బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ద్వారా టేస్టీ తేజ అభిమానులకు దగ్గరయ్యారు.కొంతకాలం పాటు జబర్దస్త్ షో కోసం పని చేసిన టేస్టీ తేజ( Tasty Teja ) యూట్యూబ్ ద్వారా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించారు.
బిగ్ బాస్ షోకు వెళ్లక ముందు ఒక యూట్యూబ్ ఛానల్ కు తేజ ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూ తాజాగా విడుదలైంది.అదిరే అభి ఈరోజు నా స్కిల్ చూపిస్తే మరుసటిరోజు ఛాన్స్ ఇచ్చారని టేస్టీ తేజ అన్నారు.

నేను ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు జబర్దస్త్( Jabardasth ) చేశానని టేస్టీ తేజ కామెంట్లు చేశారు.యూట్యూబ్ లో ఒరిజినల్ కంటెంట్ పెడితే రీచ్ పెరుగుతుందని ఆయన అన్నారు.ఇండస్ట్రీలో టాలెంటెడ్ పర్సన్స్ చాలామంది ఉన్నారని అయితే ఇక్కడ ఎంత టాలెంట్ ఉన్నా వాళ్లకు అవకాశం కావాలని ఆయన చెప్పుకొచ్చారు.ఈ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే లక్ కావాలని టేస్టీ తేజ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమ్మతో హైదరాబాద్ లో గడిపిన రోజులు మెమరబుల్ డేస్( Hyderabad Days ) అని టేస్టీ తేజ కామెంట్లు చేశారు.అమ్మంటే ఎంతో అటాచ్ మెంట్ అని ఆయన చెప్పుకొచ్చారు.
అమ్మ వల్ల ఫోన్ పగలడంతో అమ్మపై సీరియస్ అయ్యానని ఆ విషయంలో ఇప్పటికీ బాధ వేస్తుందని టేస్టీ తేజ చెప్పుకొచ్చారు.టేస్టీ తేజ ఎమోషనల్ అవుతూ ఆ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

అమ్మ పగలగొట్టిన ఫోన్ ను ఇప్పటివరకు నేను రిపేర్ చేయించలేదని టేస్టీ తేజ అభిప్రాయం వ్యక్తం చేయగా ఆ అభిప్రాయం హాట్ టాపిక్ అవుతోంది.బిగ్ బాస్ షోకు టేస్టీ తేజ రెమ్యునరేషన్( Tasty Teja Remuneration ) భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.టేస్టీ తేజ టాప్5 కంటెస్టెంట్లలో నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.







