నందమూరి కుటుంబానికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్రేజ్ గురించి మనకు తెలిసిందే.నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనంతరం ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెట్టారు.
ఇలా నందమూరి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నందమూరి తారకరత్న.ఈయన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకున్నటువంటి తారకరత్న అనంతరం ఒకే రోజున 9 సినిమాలకు సైన్ చేసి సంచలనం సృష్టించారు.

ఇలా ఇండస్ట్రీలో ఒకేరోజు 9 సినిమాలకు కమిట్ అయిన హీరోగా తారకరత్న రికార్డు సృష్టించారు.అయితే ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు.అయితే ఇందులో కొన్ని సినిమాలు షూటింగ్ పనులు మొదలు పెట్టకుండానే ఆగిపోయాయని చెప్పాలి.
మరికొన్ని సినిమాలు విడుదలైన పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి తారకరత్నకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తారకరత్న సక్సెస్ కాకపోవడంతో కొద్దిరోజుల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే తిరిగి ఈయన హీరోగా కాకుండా విలన్ పాత్రలలో నటించి మెప్పించారు.

ఇలా విలన్ పాత్రలో నటించినందుకు ఈయన ఏకంగా నంది అవార్డును కూడా అందుకున్నారు.అయితే ఇటీవల అనారోగ్య సమస్యలతో తారకరత్న మరణించిన విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈయన నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాకు గాను ఈయన తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఈ సినిమా ద్వారా తారకరత్న హీరోగా శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
అప్పట్లో ఈయన ఈ సినిమా బడ్జెట్ లెక్కవేసి కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టాలి అనుకున్నాం.అందుకే హీరో తారకరత్న రెమ్యూనరేషన్ తగ్గించాలని భావించినట్లు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
దీంతో అన్ని ఖర్చులకు కలిపి తారకరత్నకు 10 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొన్నారు.







