ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు ఆ సినిమా నిర్మాతలు సైతం కచ్చితంగా సమాధానం చెప్పలేకపోతున్నారు.ఆచార్య సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడం కొరటాల శివ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపగా ఈ సినిమా ఫలితం వల్ల కొరటాల శివ డిప్రెషన్ కు గురయ్యారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ ఎంపికైన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ అలియా భట్ జోడీ బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే అలియా భట్ పెళ్లి చేసుకోవడం, గర్భవతి కావడం, ఇతర కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది.అయితే కొరటాల శివ ఈ సినిమా కోసం వేర్వేరు పేర్లను పరిశీలించినా ఈ సినిమాలో ఇప్పటివరకు ఏ హీరోయిన్ ఫైనల్ కాలేదు.
ఒక దశలో ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వినిపించాయి.
అయితే ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాళ్ ఠాకూర్ ఎంపికైందని వార్తలు వస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ సీత తారక్ సినిమాను రిజెక్ట్ చేస్తే సీతారామం సీత తారక్ సినిమాకు ఓకే చెప్పిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చింది.ఎన్టీఆర్ సైతం కొరటాల శివ ప్రాజెక్ట్ విషయంలో తొందరపడటం లేదు.

తారక్ త్వరలో బరువు తగ్గి కొరటాల శివ సినిమాకు అనుగుణంగా తన లుక్ ను మార్చుకునే పనిలో ఉన్నారు.ప్రస్తుతం జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో తారక్ బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నారు.తారక్ లుక్ మార్చుకున్న తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.







