Tapsee bollywood : టాలీవుడ్ తో పోలిస్తే బాలీవుడ్ గ్రేట్ అంటున్న తాప్సీ.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

తెలుగులో వరుస ఆఫర్లతో క్రేజ్ ను సొంతం చేసుకున్న తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను సొంతం చేసుకుని ఆ ఆఫర్లతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే టాలీవుడ్ ద్వారానే గుర్తింపు వచ్చినా తాప్సీ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

తాజాగా తాప్సీ టాలీవుడ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ మళ్లీ వైరల్ అవుతున్నాయి.నేను ఏ విషయం గురించి మాట్లాడినా ఆ విషయం గురించి చెప్పడానికి ముందు మంచీ చెడు చూస్తానని ఆమె అన్నారు.

చెప్పాల్సిన విషయం ఏదైనా ఉంటే ముఖం మీదే చెప్పేస్తానని తాప్సీ చెప్పుకొచ్చారు.అయితే నేను ఈ విధంగా స్ట్రెయిట్ గా మాట్లాడటం కొంతమందికి నచ్చదని తాప్సీ కామెంట్లు చేయడం గమనార్హం.

కొంతమంది నన్ను అర్థం చేసుకోకుండా నాకు పొగరు అని కామెంట్లు చేస్తారని తాప్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీతో పోల్చి చూస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే నాకు ఎక్కువగా ఆఫర్లు వచ్చాయని తాప్సీ పేర్కొన్నారు.అయితే ప్రతి సందర్భంలో టాలీవుడ్ ను తక్కువ చేసే విధంగా తాప్సీ చేస్తున్న కామెంట్లపై ఎక్కువమంది నెగిటివ్ గా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగులో తాప్సీ నటించిన సినిమాలలో హిట్ సినిమాలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

బాలీవుడ్ లో సక్సెస్ దక్కినంత మాత్రాన టాలీవుడ్ ను తాప్సీ చిన్నచూపు చూడటం సరికాదని కొంతమంది వెల్లడిస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీతో పోల్చి చూస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేస్తుండటం వల్లే హీరోయిన్ తాప్సీ ఈ విధంగా కామెంట్లు చేస్తూ ఉండవచ్చని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు