తానా నూతన ట్రస్ట్ బోర్డ్ ఎంపిక ఎవరెవరంటే..

అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం) నూతన ట్రస్ట్ బోర్డ్ ని ఏర్పాటు చేసింది.

కొన్ని రోజుల క్రితమే తానా 22 వ వార్షికోత్సవాలు పూర్తి చేసుకున్న విషయం విధితమే.

అయితే తాజాగా తానా ట్రస్ట్ బోర్డ్ ఛైర్మెన్ గా హరీస్ కోయ ఎంపిక అయ్యారు.కార్యదర్శిగా వెన్నం మురళి ఎంపిక కాగా, కోశాధికారిగా ప్రభల జగదీష్ ని ఎంపిక చేశారు.

ఛైర్మెన్ గా ఎంపిక అయిన హరీశ్ ని తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి అభినందించారు.తానాలో మొత్తం 40 వేల మంది అధికారిక సభ్యులు ఉంటారు.ఈ మొత్తం వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, ఫౌండేషన్ కమిటీ , బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ ఇలా మూడు విభాగాలు ఉంటాయి.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి అధ్యక్షుడు నాయకత్వం వహిస్తారు.అయితే ఈ సారి అధ్యక్ష పదవికి జయ్ తాళ్ళూరి ఎంపిక అయ్యారు.ఈ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలని నిర్వహిస్తుంది.

Advertisement

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ పరమైన విధి విధానాల పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు.బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ , ఫౌండేషన్ సభ్యులు అందరూ కలిసి ట్రస్టీ లను ఎన్నుకుంటారు.

ట్రస్టీ లలో ఒకరిని బోర్డ్ ఛైర్మెన్ ఎంపిక చేస్తారు.

Advertisement

తాజా వార్తలు