తమిళ్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్లు మంచి గుర్తింపు పొందుతున్నారు.అందులో లోకేష్ కనకరాజ్, నెల్సన్( Lokesh Kanakaraj, Nelson ) లాంటి డైరెక్టర్లు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు.
ఇంతకుముందు తమిళ్ సినిమా ఇండస్ట్రీ అంటే మణిరత్నం, శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్లు గుర్తుకొచ్చేవారు కానీ ఇప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీ అంటే యంగ్ డైరెక్టర్లు( Young Directors ) అయినా లోకేష్ కనకరాజ్, నెల్సన్ లాంటి డైరెక్టర్లు మాత్రమే జనాలకి గుర్తుకొస్తున్నారు.ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళు మంచి సబ్జెక్టులను తీసుకొని అన్ని లాంగ్వేజ్ లలో హిట్లు కొడుతున్నారు.
ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజు దళపతి విజయ్ తో లియో( Leo ) అనే సినిమా చేస్తున్నాడు.ఇక నెల్సన్ కూడా ఇప్పటికే రజినీకాంత్ తో జైలర్( Jailer ) అనే సినిమా చేసాడు.
దాంతో ఇండస్ట్రీ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు.ఇక ప్రస్తుతం తను ఎవరితో తన నెక్స్ట్ సినిమా చేస్తాడు అనేది ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానప్పటికీ ఆయన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు అనే చెప్పాలి.ఇక లోకేష్ కనక రాజ్ సినిమాల్లో లోకేష్ అనే ఒక యూనివర్స్ ని క్రియేట్ చేయడానికి లోకేష్ కనకరాజు చూస్తున్నారు అంటే అన్ని సినిమాల్లోని క్యారెక్టర్లని ఒకచోట కలుపుతూ లింక్ చేయడం ఇలాంటి సినిమాలు జనాల్ని విపరీతంగా అలరిస్తాయి.అందుకే లోకేష్ అలా కొత్తగా ఉండేలా డిజైన్ చేసుకుంటూ ప్రతి సినిమాని తనదైన రీతిలో చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక వీళ్ళిద్దరితోపాటు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందిన డైరెక్టర్ ఎవరంటే అట్లీ…ఈయన కూడా ప్రతి సినిమాకి తన మార్కెట్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు.
ఇక ఇప్పటివరకు ఈయన తీసినవి ఐదు సినిమాలే అయినప్పటికీ ఐదు సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టాడు… రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జవాన్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో నడుస్తుంది.
