తమిళ్ సూపర్ స్టార్ విజయ్ గతంలో నటించిన పలు సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద డబ్ అయ్యి విడుదల అయ్యాయి.కానీ ఏ ఒక్కటి కూడా మినిమం వసూళ్లను సొంతం చేసుకోలేక పోయింది.
తెలుగు లో ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలి అనుకున్న హీరో విజయ్ తెలుగు సినిమా చేస్తే ఇక్కడ మంచి మార్కెట్ క్రియేట్ అవుతుంది అని భావించాడు.కాని వారసుడు సినిమా మాత్రం నిరాశ మిగిల్చింది.
అదే వారిసు సినిమా తమిళనాట 200 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.వారసుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో నిరాశ పర్చిన నేపథ్యంలో ముందు ముందు ఈ సూపర్ స్టార్ తెలుగు సినిమా ల్లో నటిస్తాడా లేదా అనేది అనుమానంగా ఉంది.

అక్కడ సూపర్ హిట్ అయిన సినిమా ఇక్కడ తీవ్రంగా నిరాశ పర్చడంతో కచ్చితంగా ఏ హీరో అయినా మళ్లీ మళ్లీ అవమానం పొందాలని భావించడు.కనుక తమిళంలోనే ఆయన సినిమాలు వరుసగా ఉంటాయని.ఇక నుండి ఆయన నటించే సినిమాలు డబ్ అయితే కావచ్చు కానీ నేరుగా తెలుగు సినిమాల్లో మాత్రం నటించే అవకాశాలు లేవు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో విజయ్ కి వ్యతిరేకంగా చాలా మంది తెలుగు ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తున్నారు.కథ ఎంపిక చేసుకునే విధానం కూడా తెలియదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.దాంతో విజయ్ తెలుగు లో ముందు ముందు నటించక పోవడమే మంచిది అంటూ ఆయన అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వారసుడు సినిమా తెలుగు లో మినిమంగా ఆడినా కూడా తెలుగు ప్రేక్షకులపై విజయ్ కి మక్కువ ఏర్పడి ఉండేది.కానీ ఆయన్ను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు.కనుక ఆయన కూడా తెలుగు ప్రేక్షకులను పట్టించుకోక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
