'సార్‌' శేఖర్ కమ్ముల సినిమా పరిస్థితి ఏంటి భయ్యా?

తమిళ స్టార్ హీరో ధనుష్( Dhanush ) తెలుగు లో వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే సార్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

 Tamil Star Hero Dhanu Movie With Shekhar Kammula , Shekhar Kammula, Dhanu Movie-TeluguStop.com

తమిళం మరియు తెలుగు లో ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ముందు ముందు ఆయన చేయబోతున్న సినిమాలన్నీ తెలుగు మరియు తమిళం లో ఉండే విధంగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.సార్ చిత్రానికి ముందే శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) దర్శకత్వం లో ధనుష్ హీరో గా ఒక సినిమా ను మొదలు పెట్టారు.

కానీ కొన్ని కారణాల వల్ల సినిమా మధ్యలోనే ఆగి పోయింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా కు సంబంధించిన కొత్త షెడ్యూల్ తేదీ వచ్చింది.

వచ్చే నెల నుండి షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి సమాచారం అందుతుంది.

తెలుగు లో విభిన్న చిత్రాల దర్శకుడిగా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది.ఫిదా, లవ్ స్టోరీ ( Fida, love story )ఇంకా పలు చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల మరియు ధనుష్ కాంబినేషన్ సినిమా అంటే కచ్చితంగా తెలుగు మరియు తమిళంలో మంచి హైప్‌ ఉండే అవకాశం ఉంది.కనుక భారీ ఎత్తున ఈ సినిమా ను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాతలు ముందుకు వస్తున్నారు.

అతి త్వరలోనే సినిమా కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యం లో ధనుష్ అభిమానులు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు.ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇదే సంవత్సరం చివర్లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.ధనుష్ చిత్రం తమిళంలో ఈ ఏడాది మరో సినిమా తో రాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube