అక్కడ టమాట కిలో రూ. 400!

టమాట ధరలు ఎక్కువ కావడం, పూర్తిగా పతనమవడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ధర ఎంత ఎక్కువైనా సరే అది కిలోకి వంద లోపే ఉంటుంది.

కానీ అక్కడ మాత్రం ఏకంగా కిలో రూ.400ను తాకడం విశేషం.ఆశించిన మేర దిగుమతులు రాకపోవడం, డిమాండ్‌ పెరిగిపోవడంతో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

Tamatokg 400 Rs

ఇంతకీ ఈ ధరలు ఎక్కడో చెప్పలేదు కదూ.మన దేశంలో కాదులెండి.మన దాయాది పాకిస్థాన్‌లో.

అక్కడ కరాచీ అనే ఓ సిటీ ఉంది తెలుసు కదా.ఆ నగరంలో టమాటా ఈ రికార్డు ధరను అందుకుంది.పాకిస్థాన్‌లో ప్రస్తుతం టమాటాకు విపరీతమైన డిమాండ్‌ ఉన్నా.

ఆ మేరకు పంట మాత్రం లేదు.ఈ మధ్యే ఇరాన్‌ నుంచి 4500 టన్నుల టమాటాలను దిగుమతి చేసుకోవాలని అనుకున్నా.

Advertisement
Tamatokg 400 Rs-అక్కడ టమాట కిలో రూ. 400-General-T

కేవలం 989 టన్నులు మాత్రమే వచ్చాయి.ఇవి ఏ మూలకూ సరిపోలేదు.

దీంతో స్థానికులు టమాటా ధర చూసి కళ్లు తేలేశారు.ఈసారి స్థానికంగా పంట ఆశించిన మేర రాలేదు.

ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది.ముఖ్యంగా ఇరాన్‌, స్వాత్‌ నుంచి టమాటాలు కరాచీకి దిగుమతి చేసుకుంటున్నారు.

టమాటాకు ఇంత కొరత ఉన్నా.స్థానిక ప్రభుత్వం దిగుమతులపై నియంత్రణలు విధించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాలకృష్ణ ,కృష్ణం రాజు..బిస్కట్స్, చేపలతో ప్రాణం కాపాడుకున్నారు
Advertisement

తాజా వార్తలు