క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా 2021 డిసెంబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇప్పటికీ ఈ సినిమా మానియా ఇంకా తగ్గలేదని చెప్పాలి.ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ మాస్ లుక్, ఈయన చెప్పే డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఊర్రూతలూగించిందని చెప్పాలి.
ఇలా ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట సెన్సేషనల్ హిట్ అందుకున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమాలో ఊ అంటావా మావ అంటూ సమంత వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసాయి.ఈ పాట ద్వారా సమంత పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమందికి చేరువైంది.
ఇక ఏ ఫంక్షన్లు చూసిన ఏ పార్టీలు చూసినా తప్పనిసరిగా ఈ పాట అక్కడ మనకు వినపడుతుంది.ఇక ఈ పాటలో అల్లు అర్జున్ సమంత కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఈ పాట సెన్సేషనల్ హిట్ అయింది.

ఇలా ఊ అంటావా మావ అనే పాటలో సమంత కన్నా ముందుగా తమన్నాను ఎంపిక చేశారట.వీరిద్దరి కెమిస్ట్రీ అయితే అద్భుతంగా ఉంటుందని భావించిన మేకర్స్ తమన్నాను ఎంపిక చేయడంతో బన్నీ మాత్రం తమన్నాను రిజెక్ట్ చేసి ఆ అవకాశాన్ని సమంతకు కల్పించినట్టు తెలుస్తోంది.అయితే అప్పుడే నాగచైతన్యత విడాకులు తీసుకున్నటువంటి సమంత ఇలా ఐటమ్ సాంగ్ లో చేయడం బాగుండదని భావించినప్పటికీ అల్లు అర్జున్ సమంతకు ఫోన్ చేసి ఈ సినిమాలో చేయడానికి ఒప్పించారని తెలుస్తోంది.మొత్తానికి ఈ పాట ద్వారా సమంత క్రేజ్ భారీగా పెరిగిపోయిందని చెప్పాలి.







