టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి( Director Rajamouli ) దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి( Bahubali movie ).
ఈ ఒక్క సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు రాజమౌళి.ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా,రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా రెండు పార్ట్ లుగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది.ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే.

కాగా ఈ మూవీలో తమన్నా ( Tamannaah ) కూడా కీలక పాత్రలో నటించినప్పటికి ప్రభాస్, రానా స్థాయిలో ఆమెకు పేరు రాలేదు.ఈ విషయం పై తాజా ఇంటర్వ్యూలో తెలిపింది తమన్నా.ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.తాను యాక్షన్ చిత్రాల్లో ఉన్నప్పటికీ క్రెడిట్ మాత్రం రాలేదన్న తమన్నా.బాహుబలి మూవీ విషయంలో మాత్రం ప్రభాస్, రానాకు ఆ క్రెడిట్ దక్కడం న్యాయమని వెల్లడించింది.ఎందుకంటే ఆ సినిమా కోసం వాళ్లిద్దరూ చేసినదానితో పోలిస్తే తన పాత్ర చాలా తక్కువని తెలిపింది.
అయినప్పటికీ అలాంటి భారీ చిత్రంలో తాను పోషించిన పాత్రకు లభించిన ప్రేమ, స్పందనకు కృతజ్ఞతలు తెలిపింది.

ఇకపోతే గత ఏడాది ఈమె ఎఫ్ 3, గుర్తుందా శీతకాలం వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.టాలీవుడ్ బాలీవుడ్ అని భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్టులలో నటిస్తోంది.
సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది మిల్క్ బ్యూటీ.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తోంది.
అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్‌తో నటించిన జైలర్ సినిమా ఆగస్టులో విడుదల కానుంది.