టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట శ్రీ మాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు పూర్తి అవుతున్న ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది తమన్నా.కాగా ఇప్పటివరకు తమన్నా దాదాపుగా 50 కి పైగా సినిమాలలో నటించింది.
కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది.

ఒకవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్ లో చిందులు వేస్తోంది.ఇప్పటికే గతంలో ఎన్నో సినిమాలలో తమన్నా ఐటమ్ సాంగ్ లు చేసిన విషయం తెలిసిందే.ఐటెం సాంగ్ లు చేసినప్పటికి హీరోయిన్గా మాత్రం అవకాశాలు తగ్గడం లేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా తమన్నా టాలీవుడ్ టాప్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేయడానికి మిల్కీ బ్యూటీ ఓకే చెప్పినట్టు సమాచారం.

అంతేకాకుండా ఈ ఐటెం సాంగ్ చేయడానికి తమన్నాకు దాదాపు రూ.50 లక్షల రూపాయల వరకు పారితోషకం అందించబోతున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు ఆ తర్వాత బాలయ్య సినిమాలో ఈమె హీరోయిన్ గా కూడా తీసుకోబోతున్నట్టు సమాచారం.ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే, ఐటమ్ సాంగ్స్ లో చిందులు వేస్తు,మరోవైపు వెబ్ సీరిస్ లలో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది.అలాగే అప్పుడప్పుడు యాడ్స్ లో కూడా నటిస్తూ బాగానే వెనకేసుకుంటోంది తమన్నా.







