హిజాబ్ ధరించకుండా వారు అక్కడికి వెళ్ళకూడదు: తాలిబాన్లు

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు( Talibans ) అధికారం కైవసం చేసుకున్న తర్వాత అక్కడి మహిళలపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్న సంగతి విదితమే.ఈ క్రమంలోనే అక్కడ కొద్ది నెలల క్రితం మహిళలను మాధ్యమిక విద్యతోపాటు, యూనివర్శిటీలో చదువులకు దూరం చేస్తూ ఉత్తర్వులు జరీ చేసారు.

 Taliban Bans Women Without Hijab From Band-e-amir National Park In Afghanistan D-TeluguStop.com

కాగా ఈ విషయం అపుడు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి విదితమే.ఇక అనేక దేశాలు తాలిబన్లు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి కూడా.

అక్కడితో ఆగకుండా వారి అరాచకం కొనసాగుతూనే వుంది.ఆ తర్వాత దూర ప్రయాణాలు, బ్యూటీ సెలూన్లపై వారు నిషేధం విధించడం జరిగింది.

Telugu Afghanistan, Bandamir, Hijab, Latest, Mohammadkhalid, Taliban-Latest News

ఇక తాజాగా.హిజాబ్‌( Hijab ) ధరించని మహిళలను బమియాన్‌లో ఉన్నటువంటి బంద్‌-ఈ-అమిర్‌( Band-e-Amir National Park ) అనే జాతీయ పార్కుతో పాటు దేశంలోని ఇతర జాతీయ పార్కుల్లోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని తాలిబన్‌ ప్రభుత్వం వైస్‌ అండ్‌ వర్చ్యు మినిస్ట్రీ (ఇస్లామిక్‌ చట్టాల అమలు శాఖ) మంత్రి మహ్మద్‌ ఖలీద్‌ హనాఫీ( Mohammad Khalid Hanafi ) సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది.మరో విషయం ఏంటంటే మహిళలు అసలు పార్కులను సందర్శించడం తప్పనిసరి కాదని కూడా హనాఫీ అన్నారు.

Telugu Afghanistan, Bandamir, Hijab, Latest, Mohammadkhalid, Taliban-Latest News

అక్కడితో ఆగకుండా… చాలా దారుణమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.ఈ విషయంలో ఎవరైనా బలవంతంగా లోపలికి రావాలని అనుకున్నట్లైతే.వారిని అడ్డుకుంటామని, అవసరమైతే బలప్రయోగం కూడా చేయాలని ఆదేశించినట్లు తాలిబన్‌ అధికార ప్రతినిధి మహ్మద్‌ సాధిఖ్‌ అఖిఫ్‌ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే మహిళలు ఇంటి నుంచి బయటికి వచ్చేప్పుడు ఇస్లామిక్‌ నిబంధనలను సరిగా పాటించడంలేదని అన్నారు.

అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.ఇదిలా ఉండగా అఫ్ఘానిస్థాన్‌లోని మహిళల స్వేచ్ఛ కోసం హ్యుమన్‌ రైట్‌ వాచ్‌ సంస్థ ప్రతినిధి హీథర్‌ బార్‌ పోరాడుతూనే ఉన్నారు.

కాగా తాలిబన్ల నుంచి అఫ్ఘాన్ మహిళలకు ఎప్పుడు స్వేచ్ఛ దొరుకుతుందోనని చాలామంది ఎదురు చూస్తున్నారు.కానీ జరిగేదెప్పుడో?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube