కోటి రూపాయల ఉద్యోగం కాదని రూ.లక్షతో బిజినెస్ మొదలుపెట్టిన మహిళ.. రూ.కోట్ల వ్యాపారం చేస్తూ?

ప్రస్తుతం చాలా ఇండస్ట్రీలలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది.పెద్దపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తూ షాకిస్తున్నాయి.

 Talent Decrypt Founder Arushi Agarwal Career Success Story Details, Talent Decry-TeluguStop.com

అయితే ఉద్యోగం చేయడం మేలా? వ్యాపారం చేయడం మేలా? అనే ప్రశ్నలకు ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు వ్యాపారం( Business ) చేస్తే మంచిదని, అలా లేని వాళ్లు మాత్రం ఉద్యోగం చేస్తే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అయితే ఒక యువతి మాత్రం ఏకంగా కోటి రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగాన్ని వదులుకుని ప్రస్తుతం కోట్ల రూపాయల బిజినెస్ చేస్తూ అందరికీ షాకిస్తున్నారు.

ఆరుషి అగర్వాల్( Arushi Agarwal ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ లో జన్మించిన్ ఆరుషి బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ తీసుకుని చదివారు.

Telugu Arushi Agarwal, Arushiagarwal, Iit Delhi, Successful, Decrypt, Decryptaru

పట్టుబట్టి కోడింగ్ ( Coding ) నేర్చుకున్న ఆరుషి ఐఐటీ ఢిల్లీలో ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కు ఎంపిక చేసేస్ స్థాయికి ఎదిగి సత్తా చాటారు.కోటి రూపాయల ప్యాకేజ్ తో జాబ్ వచ్చినా ఆ జాబ్ ను వదులుకుని లక్ష రూపాయలతో ఆరుషి టాలెంట్ డీక్రిప్ట్ ను ( Talent Decrypt ) మొదలుపెట్టారు.ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారా కోడింగ్ చేసేవాళ్లు తమ నైపుణ్యాలను పరిశీలించుకోవచ్చు.ఈ సాఫ్ట్ వేర్ సహాయంతో ఏకంగా 10 లక్షల ఉద్యోగాలు పొందారు.

Telugu Arushi Agarwal, Arushiagarwal, Iit Delhi, Successful, Decrypt, Decryptaru

కేవలం మూడు సంవత్సరాలలో ఈ సంస్థ టర్నోవర్ 50 కోట్ల రూపాయలకు చేరడం గమనార్హం.తన సక్సెస్ గురించి ఆరుషి మాట్లాడుతూ కథ సుఖాంతమని చెప్పలేనని ఇప్పటికీ ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ఓటమిని పాఠంగా తీసుకుని అర్థం చేసుకుంటే ఎవరికైనా కచ్చితంగా సక్సెస్ దక్కుతుందని ఆమె చెబుతున్నారు.ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఆరుషి తన సక్సెస్ తో ఎంతోమందికి తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు.ఆరుషి సక్సెస్ స్టోరీని చూసి ఈతరం విద్యార్థులు ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube