విశాఖపట్నం డయల్ యువర్ మేయర్, స్పందన కార్యక్రమంల ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధికారులకు తెలిపారు.శుక్రవారం జివిఎంసి ప్రధాన కార్యాలయంలో ఆమె ఛాంబర్ లో జివిఎంసి ఉన్నతాధికారులతో డయల్ యువర్ మేయర్, స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విభాగాల వారీగా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.వచ్చిన ఫిర్యాదే పలుమార్లు రావడంతో సంబంధిత అధికారులను 2, 3 రోజులలో పరిష్కరించాలని ఆదేశించారు.
ఒకే సమస్యపై పలుమార్లు ఫిర్యాదు రాకుండా ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.స్పందన పై వచ్చిన ఫిర్యాదుల పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అందుకు తగిన విధంగా ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని అధికారులను ఆదేశించారు.
ప్రజలు ఎంతో నమ్మకంతో సమస్యలు పరిష్కరిస్తామని మన వద్దకు వస్తారని వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఎస్.ఎస్.వర్మ, వై.శ్రీనివాస రావు, ప్రధాన ఇంజినీరు రవికృష్ణ రాజు, జెడి(అమృత్) విజయ భారతి, డిసి(రెవెన్యూ) పి.నల్లనయ్య, చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకర రావు, పర్యవేక్షక ఇంజినీర్లు రాజా రావు, వినయ్ కుమార్, శ్యాంసన్ రాజు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







