తెలుగు జాతి కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీ అని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.మరో పక్క పీవీ దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చి దశా దిశా నిర్దేశం చేశారని తెలిపారు.
దేశంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉండటానికి టీడీపీ కృషే కారణమని చంద్రబాబు పేర్కొన్నారు.తెలంగాణ టీడీపీ నేతలు బాగా పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారన్న ఆయన అన్ని నియోజకవర్గాల్లో కమిటీ వేశారని వెల్లడించారు.తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.







