వ్యవసాయంలో టెక్నాలజీని రైతులకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.పురుగుల మందుల స్ప్రేయింగ్, ఇతర పనుల కోసం డ్రోన్లు అందించాలని చూస్తోంది.
ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా డ్రోన్లను రైతులకు చేరువ చేసేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.సింజెంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SIPL) భారతదేశం అంతటా డ్రోన్ స్ప్రేయింగ్‌ను సులభతరం చేయడం కోసం IoTechWorld Avigationతో భాగస్వామ్య ఒప్పందం కుదర్చుకుంది.
దీని ప్రకారం, డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకునేలా శిక్షణ అందిస్తారు.అంతేకాకుండా గ్రామీణ యువతకు దీనిపై శిక్షణ అందించి ఉపాధి అందించనున్నారు.

IoTechWorld డ్రోన్ టెక్నాలజీని దేశవ్యాప్తంగా పలు చోట్ల సింజెంటా ఉపయోగిస్తోంది.వీటితో వివిధ పొలాలకు రసాయనాలను స్ప్రే చేస్తోంది.ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా పని చేస్తూ, రైతులకు టెక్నాలజీని చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఈ రెండు సంస్థల మధ్య ఎంఓయూ ప్రకారం తొలి దశలో 200 మంది గ్రామీణ యువకులకు స్ప్రేయింగ్‌పై శిక్షణ అందిస్తారు.
దీంతో పాటు ఉపాధి కూడా కల్పిస్తారు.దీని కోసం 400 ఎకరాల్లో పెద్ద ఎత్తున సన్నాహకాలు నిర్వహించారు.

అంతేకాకుండా 20 పంటల విషయంలో వీరి చేపట్టిన పనులపై రెగ్యులేటర్‌లకు డేటా అందించారు.సింజెంటా కంపెనీ అన్ని స్ప్రేల కోసం IoTech డ్రోన్ అగ్రిబోట్‌ను వినియోగిస్తున్నారు.అయితే రసాయనాలను స్ప్రే చేసే సమయంలో రైతులు చాలా ఇబ్బంది పడతారు.వాటి ప్రభావానికి గురై అనారోగ్యం, కొన్ని సందర్భాలలో మరణాలు కూడా జరుగుతుంటాయి.వీటిని నివారించేందుకు ఈ రెండు సంస్థలు టెక్నాలజీని రైతులకు అందిస్తున్నాయి.దీనిని ఇప్పటికే 13 రాష్ట్రాల్లో 15,000 మంది రైతులకు టెక్నాలజీని అందిస్తున్నారు.
రైతులకు డ్రోన్ స్ప్రేయింగ్‌పై అవగాహన కల్పించారు.







