బర్త్‌డే సందర్బంగా 'సైరా' విడుదల తేదీ ప్రకటన

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల తేదీపై గత కొన్నాళ్లుగా గందరగోళం నెలకొన్న విషయం తెల్సిందే.ఈ ఏడాది సమ్మర్‌లోనే సినిమా రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చిన విషయం తెల్సిందే.

 Sye Raa Narasimha Reddy Release Date Announcement On Ram Charan Birthday-TeluguStop.com

ఇప్పుడు సినిమా విడుదల తేదీపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు సిద్దం అయ్యారు.ముందుగా ఆగస్టు 15న చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు.

కాని అదే రోజు సాహో విడుదల చేయనున్నారు.

సాహో విడుద కానున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రోజు కాదు కదా, కనీసం ఆ వారంలో కూడా వచ్చే అవకాశం లేదు.

కనీసం రెండు మూడు వారాల తేడా అయినా ఉండాలని భావిస్తున్నారు.ఇప్పటికే సైరా కోసం ఒక తేదీని చిత్ర యూనిట్‌ సభ్యులు అనుకున్నారని, దాన్ని చరణ్‌ బర్త్‌డే అయిన ఈనెల 27న ప్రకటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

అందుకు సంబంధించిన ఒక చిన్న పోస్టర్‌ను కూడా విడుదల చేయబోతున్నారు.

మొదట చరణ్‌ బర్త్‌డే సందర్బంగా రాజమౌళి మల్టీస్టారర్‌ చిత్రం నుండి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారని అంతా భావించారు.కాని రాజమౌళికి ఆ ఆలోచనే లేదట.సినిమా విడుదలకు ఇంకా సంవత్సరంకు ఎక్కువ సమయం ఉంది.

అలాంటి సమయంలో ఎందుకు ఫస్ట్‌లుక్‌ ఇప్పుడే విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నాడట.త్వరలోనే రాజమౌళి సినిమా కొత్త షెడ్యూల్‌ కోల్‌కతాలో జరుగబోతున్న విషయం తెల్సిందే.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube