కశ్మీర్ అందాలకు ఫిదా అయిన ఐఐటీ స్టూడెంట్.. స్విట్జర్లాండ్‌ కూడా పనికిరాదట..

భారతదేశం విభిన్నమైన సంస్కృతులకు, గొప్ప చరిత్రకు ప్రసిద్ధి చెందింది.మంచుతో కప్పబడిన హిమాలయాల శిఖరాల నుంచి రాజస్థాన్‌లోని రాజభవనాలు, కేరళలోని ప్రశాంతమైన బ్యాక్‌వాటర్‌ల వరకు, ప్రతి ప్రాంతం సందర్శకులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది.

 Switzerland, An Iit Student Who Fell In Love With The Beauty Of Kashmir, Is Also-TeluguStop.com

ఈ అద్భుతాలలో ఒకటి కశ్మీర్, కశ్మీర్ చాలా అందమైన ప్రదేశం, దీనిని “భూమిపై స్వర్గం” అని పిలుస్తారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్( Indian Institute of Management Ahmedabad ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయికు చెందిన ఒక స్టూడెంట్ ఇటీవల కశ్మీర్‌ను సందర్శించారు.

దాని అందానికి ఆయన ఎంతగానో కదిలిపోయారు, అతను ఆన్‌లైన్‌లో కశ్మీర్( Kashmir ) లో తీసిన అనేక అద్భుతమైన ఫోటోలను పంచుకున్నాడు.ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూ చాలా మంది దృష్టిని ఆకర్షించాయి.

అతని పేరు సందీపన్( Sandeepan ).సుందరమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన స్విట్జర్లాండ్‌ కంటే కశ్మీర్ సహజ సౌందర్యం బాగుందని సందీపన్ ఒక ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.ఈ భారత కేంద్రపాలిత ప్రాంతంలో ఒక వారం గడిపిన తర్వాత, అక్కడ తనకు కనిపించిన నిర్మలమైన అందానికి ఫిదా అయిపోయారు.ఆన్‌లైన్ పోస్ట్‌లో, సందీపన్ తన పర్యటన నుంచి మూడు అద్భుతమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

మొదటిది పసుపు పూల పొలం, దూరంగా పెద్ద కొండలతో చూపించింది.రెండవది మంచుతో కప్పబడిన పర్వత శ్రేణి దృశ్యాన్ని క్యాప్చర్ చేసింది.మూడవ ఫోటో కశ్మీర్‌లోని పాపులర్ పర్యాటక ప్రదేశమైన దాల్ సరస్సుపై ( Dal Lake )బ్యూటిఫుల్ హౌస్‌బోట్‌ను చూపించింది.

సందీపన్ పోస్ట్ త్వరగా వైరల్ అయ్యింది, దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి.స్థానిక ఏజెంట్‌తో ప్రయాణిస్తే ఎక్స్‌పీరియన్స్ ఇంప్రూవ్ అవుతుందని సందీపన్ సూచించారు.ఏజెంట్ హోటల్ బుకింగ్స్‌ను మేనేజ్ చేస్తూ సౌకర్యవంతమైన అన్వేషణ కోసం కారును అందించగలడని వివరించారు.నలుగురితో కూడిన కుటుంబానికి ఆరు రోజుల ట్రిప్‌కు విమాన ఛార్జీలతో కలిపి మొత్తం 1.3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube