గచ్చిబౌలి జియంసి బాలయోగి స్టేడియంలో మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి మరియు జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటిలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V.
శ్రీనివాస్ గౌడ్ పాల్గోని ప్రారంభించారు.
అనంతరం నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్స్ షిప్ లో బంగారు పతకాలు సాధించిన సాధించిన శీవాని కర్ర, మెఘన అయ్యర్ లను ఘనంగా సన్మానించారు.
అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన పలువురు స్విమ్మింగ్ క్రీడాకారులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి,రాష్ట్ర హాకీ సంఘం అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్, స్పోర్ట్స్ అధికారులు సుజాత,ధనలక్ష్మి, దీపక్, గోకుల్, కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.