ఎప్పటిలాగే అతను సముద్ర తీరంలో ఈతకు వెళ్లాడు.సంతోషంగా ఈదుతూ గడిపేస్తున్నాడు.అప్పుడే ఊహించని ఉపద్రవం ఎదురైంది.ఎక్కడి నుంచి వచ్చిందో ఓ తిమింగలం అతడిని అమాంతంగా మింగేసింది.బీచ్‌లో ఒడ్డున ఉండి చూస్తున్న వారంతా ఈ హఠాత్పరిణామానికి నిశ్చేష్టులైపోయారు.ఈ ఆసక్తికర ఘటన గురించిన వివరాలిలా ఉన్నాయి.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో బుచ్చన్ పాయింట్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఇటీవల ఈతకు వెళ్లాడు.అక్కడకు ఎప్పటిలాగే చేపలు పట్టే వాళ్లు, సందర్శకులు వచ్చి తమ తమ పనుల్లో ఉన్నారు.
ఈ క్రమంలో 5 మీటర్లున్న ఓ భారీ తెల్ల తిమింగలం హఠాత్తుగా అక్కడకు వచ్చింది.ఈత కొడుతున్న వ్యక్తిని అందరూ చూస్తుండనే కొరికి, కొరికి తినేసింది.మనిషిపై దాడి చేసి చంపేసిన తిమింగలం తెల్లగా ఉందని, ఇది అత్యంత అరుదుగా మాత్రమే కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు
.ఈ ప్రాంతంలో దాదాపు 1963 తర్వాత తెల్ల తిమింగలం కనపడడం ఇదే తొలిసారని స్థానికులు పేర్కొన్నారు.ప్రమాదం గురించి తెలుసుకుని, పోలీసులు హుటా హుటిన అక్కడకు చేరుకున్నారు.గల్లంతైన వ్యక్తి కోసం హెలీ క్యాప్టర్లతో గాలింపు చేపట్టారు.గజ ఈత గాళ్లను రంగంలోకి దించారు.అయితే మృతుని వివరాలేమీ తెలియలేదు.
అయితే కొంత సేపటికి మృతుని శరీర భాగాలు తీరానికి కొట్టుకొచ్చాయి.మృతుడు స్థానికుడై ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
తిమింగళం దాడితో ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసేశారు.