రీ ఎంట్రీ ఇవ్వబోతున్న రఘువీరా ? అదే సస్పెన్స్

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి రాజకీయ జీవితం పై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.చాలా కాలంగా రఘువీరారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

 Suspense On Former Minister Raghuveera Reddy Political Re Entry Details, Raghuve-TeluguStop.com

ఏపీ,  తెలంగాణ విభజన తర్వాత కాంగ్రెస్ పెరిగిన వ్యతిరేకత నేపథ్యంలో,  ఆయన సైలెంట్ అయిపోయారు.పూర్తిగా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

వ్యవసాయం చేసుకుంటూ తన సొంత గ్రామమైన అనంతపురం జిల్లాలోని మడకశిర మండలంలోని నీలకంఠాపురానికి ఆయన పరిమితం అయ్యారు.తన స్వగ్రామంలో ఆధ్యాత్మిక భావంతో కనిపిస్తూ పూర్తి సమయం కుటుంబానికి కేటాయిస్తున్నారు.

గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులను చేపట్టారు.అలాగే ప్రజల కోసం ఒక కంటి ఆసుపత్రిని తీసుకొచ్చారు.

ఎక్కువగా గ్రామ అభివృద్ధి విషయంపైనే ఫోకస్ పెడుతూ,  ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.అయితే ఇటీవల కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర తమ జిల్లాకు వచ్చిన సందర్భంగా రఘువీర రెడ్డి హాజరయ్యారు.దీంతో మళ్లీ కాంగ్రెస్ లోకి ఆయన రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరిగింది.అయితే ఈ ఉగాది తర్వాత రఘువర పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుంది.

తన రాజకీయ భవిష్యత్తు పై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో, రఘువీరా ఈ ఉగాది తరువాత ప్రకటన చేయబోతున్నారట.కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇస్తారా లేక టిడిపిలో చేరుతారా అనే విషయం లో సందిగ్ధం నెలకొంది.ఇప్పటికే ఆయనకు వైసిపి తో సహా అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి.కానీ ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంలో ఎవరికి క్లారిటీ లేదు.దీంతో ఉగాది తర్వాత రఘువీర చేయబోయే రాజకీయ ప్రకటనపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.ఇక ఆయన ప్రకటనపై కాంగ్రెస్ కూడా వేచి చూస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube