'భోళా శంకర్'లో అక్కినేని యంగ్ హీరో.. బర్త్ డే కానుకగా అఫిషియల్ అనౌన్స్!

Sushanth Roped In For Chiranjeevi Bholaa Shankar Details, Chiranjeevi, Bholaa Shankar, Sushanth , Director Meher Ramesh, Bholaa Shankar Update, Tamanna, Sushanth Bholaa Shankar, Akkineni Hero Sushanth, Sushanth Birthday

మెగాస్టార్ (Megastar Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్ లో అదిరిపోయే సక్సెస్ రేట్ తో దూసుకు పోతున్నాడు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు సక్సెస్ లను అందుకున్న చిరు ఆ తర్వాత కూడా పలు ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు.

 Sushanth Roped In For Chiranjeevi Bholaa Shankar Details, Chiranjeevi, Bholaa Sh-TeluguStop.com

ఈ సినిమాల తర్వాత వెంటనే మరో సినిమాను రిలీజ్ చేసేందుకు మెగాస్టార్ సన్నాహాలు చేస్తున్నాడు.మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘భోళా శంకర్’(Bholaa Shankar).

ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతుంది.

రీమేక్ సినిమా అయినా కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మెహర్ రమేష్ సాలిడ్ మాస్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఈ రోజు అదిరిపోయే అప్డేట్ ప్రకటించారు మేకర్స్.

ఈ సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడని తెలిపారు.మరి ఆ యంగ్ హీరో ఎవరో కాదు.అక్కినేని యువ హీరో సుశాంత్ (Sushanth).ఇతడి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు మేకర్స్ ఈ సినిమాలో సుశాంత్ కూడా ఉన్నట్టు తెలిపారు.అయితే ఈ సినిమాలో పాజిటివ్ రోల్ నా లేదంటే నెగిటివ్ రోల్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.ప్రెజెంట్ శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

Sushanth Roped In For Chiranjeevi's Bholaa Shankar, Chiranjeevi, Bholaa Shankar, Sushanth - Telugu Bholaa Shankar, Chiranjeevi, Sushanth, Sushanthroped #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube