కోలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్స్ లో సూర్య జ్యోతిక జోడీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.సూర్య ఈ మధ్య కాలంలో వరుస విజయాలను సాధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఒకవైపు నటుడిగా మరోవైపు నిర్మాతగా సూర్య కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.సూర్య జ్యోతికల కూతురు దియా ఈ ఏడాది పదో తరగతి పరీక్షను రాయగా తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి.
ఈ పరీక్షల్లో దియా అద్భుత ప్రతిభను కనబరిచారు.
500 మార్కులకు పరీక్షలు జరగగా దియాకు ఏకంగా 487 మార్కులు వచ్చాయి.
తమిళంలో 95 మార్కులు, ఇంగ్లీష్ లో 99 మార్కులు, గణితంలో నూటికి నూరు మార్కులు, సైన్స్ లో 98 మార్కులు, సోషల్ లో 95 మార్కులు సాధించి దియా వార్తల్లో నిలిచారు. 97.4 పర్సంటేజ్ సాధించడం అంటే సాధారణ విషయం కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.తల్లీదండ్రులు సూపర్ స్టార్లు అయినా దియా చదువును నిర్లక్ష్యం చేయలేదు.
దియా భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడతారో చూడాల్సి ఉంది. చెన్నైలోని ప్రముఖ పాఠశాలలో దియా పదో తరగతి చదివారు.తమిళం నుంచి సోషల్ వరకు అన్ని సబ్జెక్ట్ లలో దియా అదిరిపోయే మార్కులు సాధించారు.దియా పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించడంతో సూర్య, జ్యోతికల ఆనందానికి అవధులు లేవని తెలుస్తోంది.
అయితే దియా సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ లేదని మరి కొందరు భావిస్తున్నారు.

మరోవైపు సూర్య ఇతర హీరోల సినిమాలకు తన వంతు సపోర్ట్ అందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.విక్రమ్ సినిమాలో సూర్య గెస్ట్ రోల్ లో నటించగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది.
విక్రమ్ ఓటీటీ రిలీజ్ కోసం కమల్ హాసన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







