కోలీవుడ్ హీరోలకు మన తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.మరి అలాంటి హీరోల్లో సూర్య ఒకరు.
ఈయనకు టాలీవుడ్ లో మిగతా తమిళ్ హీరోల కంటే ఎక్కువ మార్కెట్ ఉంది.కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్య (Suriya) కు గజినీ సినిమా నుండి ఫాలోయింగ్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.
ఈ మధ్య కాలంలో సూర్య చేస్తున్న సినిమాలు మరింత ఆదరణ పొందుతున్నాయి.
ఇక ప్రజెంట్ సూర్య తన 42వ (Suriya 42) సినిమా చేస్తున్నాడు.
డైరెక్టర్ శివ (Siruthai Siva) దర్శకత్వంలో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఈ సినిమా సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఇక గ్రీన్ స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా నుండి మేకర్స్ ఈ రోజు అదిరిపోయే బిగ్ అప్డేట్ అందించారు.సూర్య ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఆడియో హక్కులకు సంబంధించిన బిగ్ న్యూస్ రివీల్ చేసారు.

ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో లేబుల్ సరిగమ సౌత్ వారు సొంతం చేసుకున్నట్టుగా ఫిక్స్ అయ్యింది.మరి ఈ సినిమా హక్కులు అయితే భారీ ధరకు కొన్నట్టుగా సినీ వర్గాలలో గట్టి టాక్ వినిపిస్తుంది.మొత్తానికి రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టు తెలుస్తుంది.చూడాలి ఇది కోలీవుడ్ లో బిగ్గెస్ట్ సినిమాగా నిలుస్తుందో లేదో.








