పండగ బోనస్ లు ,ఏడాదికి ఒకసారి ఇంక్రిమెంట్లు ఇచ్చే యజమానులుంటారు.వాటినే కళ్లకద్దుకునే తీసుకునే ఉద్యోగులుంటారు.
కానీ ఏకంగా కార్లు ఇల్లు ఇచ్చే యజమానులుంటారా.కానీ ఉన్నారు అతనే సావ్జి డోలకియా.
సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జి డోలకియా తెలియని వారుండరు.ఎందుకంటే ప్రతిసారి తనదైన శైలిలో ముందుకు వెళుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన్ని మెచ్చుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు.ప్రతి ఏటా తమ ఉద్యోగులకు ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు ఇలా ఎంతో విలువైన గిఫ్ట్స్ ఇస్తూ ఆశ్చర్యంలో ముంచెత్తే ఈయన ఈసారి ఏకంగా ముగ్గురు ఉద్యోగులకు బెంజ్ కార్లను బహుమతి ఇచ్చారు…

సూరత్‌లో బహుమతుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్ చేతుల మీదుగా ఆ ముగ్గురు ఉత్తమ ఉద్యోగుల గిఫ్ట్స్ అందుకున్నారు.ఇక HR ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇటీవల కారు ప్రమాదంలో చనిపోయారు.వారి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం కూడా అందించారు డోలకియా.డోలకియా ఉద్యోగులకు కానుకలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు.2016లో దీపావళి కానుకగా మొత్తం 1716 మంది ఉద్యోగులకు ఎంపిక చేసి బహుమతులు ఇచ్చారు.అందుకోసం ఏకంగా రూ.51 కోట్లు ఖర్చు చేశారు.కొందరికి పాట్లు ఇస్తే, మరికొందరికి కార్లు ఇఛ్చారు.ఇంకొంత మందికి బంగారు ఆభరణాలు, వజ్రాలు గిఫ్ట్‌గా ఇచ్చారు.
అంతేకాదు వేల కోట్లకు అధిపతి అయిన డోలకియా 2016లో తన కుమారుడు ద్రావ్యకు విచిత్ర పరీక్ష పెట్టారు.నెల రోజుల పాటు నిరుపేదగా బతకాలని కండిషన్ పెట్టారు.రూ.7వేలు, 3 జతల బట్టలు ఇచ్చి కొచ్చికి పంపారు.తండ్రి పేరు ఎక్కడా చెప్పకుండా, మొబైల్ వాడకుండా ఉండాలని ప్రతి పైసా కష్టపడి సంపాదించాలని చెప్పారు.వారానికి మించి ఒకే చోట పనిచేయకుండా నెల రోజుల బతకాలని సూచించారు.
అలా తండ్రి పెట్టిన పరీక్షలో పాసైన ద్రావ్య అనంతరం తమ కంపెనీలోనే ఉద్యోగంలో చేరారు … అప్పట్లో సోషల్ మీడియాలో వైరలైంది .

మన ఉద్యోగులు బాగుంటేనే మన వ్యాపారం బాగుంటుంది అనే విషయాన్ని నమ్ముతారు డోలకియా.అందుకే ఎప్పుడూ వారిని సంతోషంగా ఉంచాలనే ప్రయత్నిస్తారు.అంతేకాదు పని విషయంలోనూ అంతే కసిగా ఉంటారు.
కార్మికులకు జీతాలే సరిగా ఇవ్వని సంస్థలు,యజమానులు ఉన్న ఈ రోజుల్లో డోలకియా లాంటి వ్యాపారస్థులు నిజంగా గ్రేట్… అందుకే అతని వ్యాపరమే కాదు అతని మనసు కూడా వజ్రం అని పొగుడుతున్నారు.







