పల్లీలు తిని నీళ్లు తాగితే ఎందుకు దగ్గొస్తుంది..దాని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?

పల్లీలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.చిన్నపిల్లలు కానివ్వండి,పెద్దవాళ్లు కానివ్వండి పల్లీలు కనపడగానే పచ్చీవే నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు.

 Unknown Facts Of Ground Nuts-TeluguStop.com

అయితే మనలో చాలామందికి పల్లీలు తినగానే నీళ్లు తాగే అలవాటుంటుంది.కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు పల్లీలు తినగానే నీళ్లు తాగకు దగ్గొస్తుంది అని అంటుటారు…పల్లీలు శరీరానికి పోషకాలు అందిస్తాయి.

మరి వీటిని తినగానే నీళ్లెందుకు తాగకూడదు.తాగితే సమస్యెందుకు వస్తుంది.

దానికి కారణాలు ఏంటి తెలుసుకోండి.

· పల్లీలలో ఆయిల్ అధిక శాతం ఉంటుంది.అందువలన పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్‌తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.

· పల్లీలు తినగానే నీళ్లు తాగొద్దు అనడానికి గల మరో కారణం.పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి.అలాంటప్పుడు వీటిని తినగానే నీటిని తాగితే అవి చల్లగా ఉంటాయి కాబట్టి లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి పొసగవు.

ఈ క్రమంలో దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వస్తాయి.

· చివరిగా మరో కారణం ఏమిటంటే.

పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు.దీంతో గ్యాస్, అజీర్ణం ఇబ్బంది పెడతాయి.

కనుక పల్లీలను తినగానే కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు వేచి ఉండడం ఉత్తమం.అప్పుడు కూడా వేడి నీరు తాగాల్సి ఉంటుంది.

దీంతో తిన్న ఆహారం త్వరగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జీర్ణమవుతుంది.

ఇప్పుడు తెలిసింది కదా పల్లీలు తినగానే దగ్గు ఎందుకు వస్తుందో,దాని వెనుక ఉన్న కారణం ఏంటో.సో ఇకపై పల్లీలు తిన్నప్పుడు వెంటనే వాటర్ తాగి దగ్గుతో ఇబ్బంది పడకండి.ఒకవేళ తాగినా,దగ్గొచ్చినా ఎందుకొస్తుందో రీజన్ గుర్తు తెచ్చుకోండి.

కాసేపటికి ఎలాగు తగ్గిపోతుంది…కాబట్టి నో ప్రాబ్లస్.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube